టీడీపీని వీడిన అయ్యన్న సోదరుడు

విశాఖపట్నం, సెప్టెంబర్ 4, (way2newstv.com)
విశాఖజిల్లా నర్సీపట్నంలో టి డి పీ కి గట్టి దెబ్బ తగిలింది. తెలుగుదేశంపార్టీ జాతీయ కార్యదర్శి  నారా లోకేష్ నర్సీపట్నం పర్యటనలో ఉండగానే నర్సీపట్నం మున్సిపాలిటీ టిడిపి అధ్యక్షుడు, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సోదరుడు చింతకాయల సన్యాసిపాత్రుడు పార్టీకి గుడ్ బై చెప్పారు. మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, చింతకాయల సన్యాసి పాత్రుడు ఒకే రోజు జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న తరుణంలో అన్నకు, తమ్ముడు సన్యాసిపాత్రుడు ఝలక్ ఇచ్చారు.
టీడీపీని వీడిన  అయ్యన్న సోదరుడు

సన్యాసి పాత్రుడు సతీమణి మున్సిపల్ చైర్ పర్సన్ చింతకాయల అనిత తో సహా, పదిమంది కౌన్సిలర్లు మరియు వివిధ పార్టీ పదవులలో ఉన్న నాయకులు,  మరో వంద మంది కార్యకర్తలతో సహా పార్టీని వీడారు. గత 30 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి సేవలందించిన సన్యాసి పాత్రుడు తన అనుచరగణంతో పార్టీ మారడంతో సహజంగానే మున్సిపాలిటీలో టిడిపి బలహీన పడినట్లయింది. నర్సీపట్నం సిటీక్లబ్  ఆవరణలో జరిగిన మీడియా సమావేశంలో తన రాజీనామా ప్రకటన చేశారు. ఈ  సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా పార్టీతో విడదీయరాని బంధం ఉన్నప్పటికీ, స్థానిక నాయకుల ఒంటెద్దు పోకడలు, పార్టీలో  తగిన గుర్తింపు లేకపోవడంతో పార్టీని వీడాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.  తదుపరి ఏ పార్టీలో చేరేది కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

Previous Post Next Post