సిటీలో ట్రాన్స్ పోర్ట్ కోసం వన్ కార్డ్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

సిటీలో ట్రాన్స్ పోర్ట్ కోసం వన్ కార్డ్

హైద్రాబాద్, సెప్టెంబర్ 26, (way2newstv.com)
నగర ప్రయాణికులకు సులభతరమైన ప్రయాణం చేసేందుకు వీలుగా నగర రవాణా విభాగాలు సంయుక్తంగా ముందడుగు వేశాయి. డిసెంబర్‌లో మెట్రో కారిడార్ 2 అందుబాటులోకి వచ్చాక దీనికి శ్రీకారం చుట్టనున్నారు. కాగా దీనికి ముందే ప్రయోగాత్మకంగా పరిశీలించనున్నారు. ట్రాఫిక్ రద్దీతో సతమతమయ్యే నగర ప్రజలకు రైలు, రోడ్దు రవాణా సదుపాయాలు ఏది అందుబాటులో ఉంటే దానిలో సుభంగా ప్రయాణించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో వేగంగా అభివృద్ది చెందుతున్న నగర జీవనంలో ప్రయాణం సులభ తరంగా అయ్యేలానే కాకుండా సమయం సద్వినియోగం చేసుకునేలా ప్రయాణికులకు కామన్ ట్రావెల్ టికెట్‌న్ అధికారులు అందుబాటులోకి తీసుకు రానున్నారు..మెట్రో మొబిలిటీ కార్డు పేరుతో పూర్తి స్థాయిలో సిద్దం చేస్తున్న ఈ కార్డు ప్రయాణికుని వద్ద ఉంటే నగర ముఖ చిత్రాన్నే మార్చేవిధంగా మెట్రో రైలుతో పాటు , జంటనగరాల్లో ప్రయాణికులను చేరవేసే ఎంఎంటిఎస్, ఆర్టిసి, ఆటోలు, ట్యాక్సీలలో టికెట్ లేకుండా ప్రయాణించ వచ్చు. 
సిటీలో  ట్రాన్స్ పోర్ట్ కోసం వన్ కార్డ్

అయితే ఈ కార్డు ప్రారంభ రేటు రూ. 1000 నుంచి 2 వేల అవరకు అందుబాటులో ఉంటాయి.. ప్రయాణం చేయడం ద్వారా కార్డులో ఉన్న మొత్తం ఖర్చయితే సులభంగా కార్డును రీచార్జ్ చేసుకునే విధంగా ఈ కార్డును సిద్దం చేస్తున్నారు. ఈ కార్డు ఉంటే చాలు వీటిలో ఏ ప్రయాణ సౌకర్యానికైన వినియోగించుకునే వీలు కల్పించారు. ప్రస్తుతం ఉన్న పద్దతి ప్రకారం మెట్రో , ఎంఎంటిఎస్, ఆర్టిసి,ట్కాక్సీ ,ఆటో ఏది ఎక్కి ప్రయాణించిన సంబంధిత వ్యక్తి ప్రయాణ చార్జీలు చెల్లించాల్సిందే.మెట్రో ,ఎంఎంటిఎస్ ప్రయాణానికి కౌంటర్ల వద్ద గంటల సమలయం క్యూలో నిలబడాల్సి వస్తుంది. అయితే అటువంటి ఇబ్బందులు లేకుండా ఉండటంతో పాటు మెరుగైన ప్రజా రవాణా వ్యవస్థను తయారు చేయాలనే లక్షంతో దీన్ని తీసుకు వచ్చారు. దీని కోసం ప్రత్యేకంగా సాప్ట్‌వేర్‌ను అధికారులు తయారు చేశారు. మెట్రో రైలులో ప్రస్తుతం అమలు ఉన్న సాప్ట్‌వేర్‌తో పాటు,స్మార్ట్ కార్డు విధానంలోనే కొత్త కార్డు తయారీ,వినియోగం ఉండ నుంది. కార్డులన్నీ మెట్రో రైలు, నగర రైలు వ్యవస్థతో పాటు ,బస్‌స్టేషన్ల, ఎస్‌బిఐ బ్యాంకుల్లో అందుబాటులో ఉంటాయి. మెట్రో నడిచే మార్గాల్లో ముందుగా రెండు మెట్రో స్టేషన్లు, 100 ఆర్టిసిబస్సులు, 50 ఆటోల్లో అందుబాటులో ఉండే విధంగా 2019 చివరి నాటికి పైలెట్ ప్రాజెక్టుగా మొబిలిటీ కార్డును అందబాటులోకి తెస్తారు.