హైదరాబాద్ సెప్టెంబర్ 04,(way2newstv.com)
అందరికీ వినోదాన్ని పంచే సినిమాలో భాగమైన వారికి సొంత ఇంటి కల నెరవేరే క్రమంలో చిత్రపురి కాలనీలో ఎదురవుతున్న సమస్యలను సామరస్యపూర్వంగా పరిష్కరించే దిశాగా ముందుకు వెళ్లామని జనసేన అద్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. చిత్రపురిలో ఇళ్లు దక్కక వేదనకు లోనవుతున్న వారికి భరోసాగా ఉండి, వారి గొంతుకనవుతానని హామి ఇచ్చారు. ఆ అంశం పై ఎన్.శంకర్ పరుచూరి వెంకటేశ్వర రావు, తమ్మారెడ్డి భరద్వాజ తోను చర్చిస్తానని చెప్పారు. బుధవారం ఉదయం హైదరాబాద్ లోని జనసేన కార్యాలయంలో చిత్రపురి సాధన సమితి సభ్యులు పవన్ కళ్యాణ్ ను కలిశారు.
చిత్రపురి కాలనీలో ఆర్హులకు ఇళ్లు
జూనియర్ ఆర్టిస్టులుగా, కాస్ట్యూమర్లుగా, ఫైటర్లుగా… ఇలా సినిమా రంగంలోని 24 కాప్ట్స్ లో పని చూస్తున్న తమకు ఇళ్లు దక్కడం లేదనీ, చిత్ర పరిశ్రమకు సంబంధం లేని వారికి ప్లాట్స్ దక్కుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నించినవారికి పని లేకుండా చేస్తున్నారని బాధపడ్డారు. పవన్ కళ్యాణ్ స్పందిస్తూ తెలుగు చిత్ర పరిశ్రమకు హైదరాబాద్ కేంద్రంగా ఉంటుంది. హింది సినిమాకు ముంబయి కేంద్రం అయినట్టు-మన తెలుగు భాషకు సంబంధించి ఏ యాసలో తీసినా హైద్రబాద్ కేంద్రం అవుతుంది. కాబట్టి హైదరాబాద్ చిత్రపురి లో తెలుగు సినిమా రంగంలోని వారికి సొంత ఇంటి కల తీరాలి. ఒక పక్షి కూడా చిన్న గూడు కట్టుకునేందుకు తపిస్తుంది. అలాగే సినీ కార్మికులు కూడా తమ పిల్లలకు ఇల్లు ఇవ్వాలనుకొంటారు. చిత్రపురిలో ఇళ్లకు సంబంధించి మీకు భరోసాగా నిలుస్తాను. దీని పై చిత్ర పరిశ్రమలోని వారితో మాట్లాడుతాను. పార్టీపరంగా మీకు అందుబాటులో శంకర్ గౌడ్, మహేందర్ రెడ్డి ఉంటారని పవన్ కళ్యాణ్ అన్నారు.
Tags:
telangananews