కూలిపోయిన బ్రిడ్జి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కూలిపోయిన బ్రిడ్జి

కాకినాడ సెప్టెంబర్ 26, (way2newstv.com)
తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం తిరుమాలి, ఇర్రిపాక గ్రామాల మధ్య నిర్మించిన బ్రిడ్జి కూలిపోయింది. బుధవారం రాత్రి  ఏలేరు ప్రాజెక్టు అధికారులు మూడు వేల క్యూసెక్కుల
నీటిని విడుదల చేయడంతో ఈ బ్రిడ్జి సామర్ధ్యం తట్టుకోలేక విరిగి నేలమట్టం అయింది. అయితే గతంలో ఈ బ్రిడ్జి నిర్మాణం జరిగేటప్పుడు ఉన్న  అధికారులు మొక్కుబడిగా 
కూలిపోయిన బ్రిడ్జి

ఈ బ్రిడ్జి నిర్మించడంతో నాసిరకం పనులు చేస్తున్న అనేక రూపాయలు మామూళ్ల రూపంలో అధికారులకు అందినట్లు నిలువుటద్దం లా తెలుస్తుంది. అయితే ఈ బ్రిడ్జ్ కోల్పోవడం కారణంగా దిగువప్రాంతంలోని ఉన్న రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట చేతికందే సమయంలోనే బ్రిడ్జి కూలిపోవడం ఆ వరద నీరు పంట పొలాల్లోకి చేరుతుంది ఏమోనని భయపడుతున్నారు.
అయితే ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని ఇసుకను ఏలూరు ప్రాజెక్ట్ నుండి తీసి తమ స్వలాభం కొరకు వాడినట్లు గ్రామస్తులు తెలుపుతున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలనిరైతులు, గ్రామస్తులు కోరుతున్నారు