శాస్త్రవేత్తలతో ప్రధాని మోదీ
బెంగళూరు, సెప్టెంబర్ 6, (way2newstv.com)
ఇస్రో శాస్త్రవేత్తలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రసంగించారు. బెంగుళూరులోని సెంటర్లో ఆయన మాట్లాడుతూ చంద్రుడిని ముద్దాడాలన్న ఆశ మరింత ప్రబలమైందన్నారు. భారత ప్రజలారా.. గత కొన్ని గంటల నుంచి యావత్ దేశం దిగ్భ్రాంతికి లోనైంది. మన శాస్త్రవేత్తలు ఎంతో కృషి చేశారు. మనం మన లక్ష్యానికి ఎంతో దగ్గరకు వచ్చాం. కానీ ఇంకా ఎంతో చేయాల్సి ఉంది. స్పేస్ప్రో గ్రామ్, శాటిలైట్ల పనితీరుపై మన గర్వంగా ఫీలవుతున్నామని అన్నారు. భారత మాత విజయం కోసం మన శాస్త్రవేత్తలు కృషి చేశారు. భారత్ కోసం పోరాటం చేశారు.
ఇది వెనుకడుగేమీ కాదు
భరతమాత తల ఎత్తుకునేలాచేశారన్నారు. ఉన్నత స్థాయిలో పెట్టేందుకు కృషి చేశారని ప్రశంసించారు. మీరు జీవితాన్ని అంకితం చేశారు. నిన్న రాత్రి మీ మనస్సును అర్థం చేసుకున్నాను. మీ కన్నులు ఎన్నో విషయాలుచెబుతాయి. నిరాశలో మీరున్నారు. అందుకే నేను మీ మధ్య ఎక్కువ సమయం గడపలేకపోయాను. మళ్లీ ఉదయం ఒకసారి మీతో మాట్లాడాలనుకున్నానని అన్నారు. మీరెన్నో రోజుల నుంచి నిద్రలేని రాత్రులు గడిపారు.. మనకు ఇవాళ ఒక అవరోధం ఎదురైంది.. కానీ ఏమాత్రం నీరుగారాల్సిన అవసరం లేదు. మన లక్ష్యం నుంచి దూరం కావాల్సిన అవసరం లేదు. చంద్రుడిని చేరుకునే లక్ష్యాన్నివదిలేది లేదన్నారు.మనకు మరిన్ని లక్ష్యాలు ఉన్నాయన్నారు. ఇండియా మీతో ఉందని ప్రధాని సైంటిస్టులకు తెలిపారు. మీరు అసాధారణ నిపుణులు, దేశ ప్రగతికి అనిర్వచనీయ సేవ చేశారని ప్రధాని అన్నారు.భారతమాత కోసం శాస్త్రవేత్తలు ఎన్నో త్యాగాలు చేశారని.. వారి కుటుంబాలకు అయన తమ సెల్యూట్ తెలిపారు.
Tags:
Andrapradeshnews