మోటార్ సైకిల్ పై కాల్వల సందర్శించిన మంత్రి. - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మోటార్ సైకిల్ పై కాల్వల సందర్శించిన మంత్రి.

వనపర్తి సెప్టెంబర్ 10 (way2newstv.com)
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మంగళవారం వనపర్తి జిల్లాలోని కే ఎల్ ఐ కాల్వలను మోటార్ సైకిల్ పై ప్రయాణిస్తూ పరిశీలన చేశారు. మొదటగా మంత్రి గోపాల్పేట మండలంలోని బుద్ధారం గ్రామంలో ఉన్న కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కాలువను పరిశీలించి పరిస్థితులపై రైతులతో ఆరా తీశారు. 
మోటార్ సైకిల్ పై కాల్వల సందర్శించిన మంత్రి.

ఈ సందర్భంగా మంత్రి చెరువు కట్ట లపై తిరుగుతూ నీళ్లు వదిలే తూములనును కూడా పరిశీలించి రైతులకు అన్ని వివరాలను తెలుసుకున్నారు. అదేవిధంగా పెద్దమందడి మండలం లోని బ్రాంచ్ కెనాల్ను కూడా ఆయన పరిశీలించారు. పెద్దమందడి బ్రాంచ్ కెనాల్ జీరోపాయింట్ నుండి 24 కిలోమీటర్ల వరకు ఆయన మోటార్ సైకిల్ పై ప్రయాణించి కాల్వ ను పరిశీలించారు. మోటార్ సైకిల్ పై ప్రయాణిస్తున్న మంత్రి వ్యవసాయ పొలం పనుల్లో నిమగ్నమైన రైతులను,వ్యవసాయ కూలీలు ఆప్యాయంగా పలకరిస్తూ అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఈ సందర్భంగా కాల్వ పరిస్థితులపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ తన పర్యటన కొనసాగించారు