ఒకే దేశం.. ఒకే కార్డు! - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఒకే దేశం.. ఒకే కార్డు!

పాస్పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంకు ఖాతా అన్నీ ఒకేదాంట్లో నిక్షిప్తం
జనగణన కోసం ప్రత్యేక యాప్
కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడి
న్యూఢిల్లీ  సెప్టెంబరు 24  (way2newstv.com)    
డిజిటల్ రూపంలో జనాభా లెక్కల సేకరణ వల్ల పౌరుల ఆధార్, పాస్పోర్టు, డ్రైవింగ్ లైసెన్సు, బ్యాంకు ఖాతాలు వంటి వాటిని ఒకే కార్డులో నిక్షిప్తం చేయడానికి వీలు కలుగుతుందని కేంద్ర హోం మంత్రిఅమిత్ షా చెప్పారు. ఈ మేరకు ‘బహుళ ప్రయోజన గుర్తింపు కార్డు’ను జారీచేసే ఆలోచనను ఆయన తెరపైకి తెచ్చారు. 2021 జనాభా లెక్కల సేకరణలో తొలిసారిగా మొబైల్ యాప్నుఉపయోగించనున్నట్లు తెలిపారు. దీనిద్వారా ప్రజలు సొంతంగా తమ వివరాలను నమోదు చేసుకోవచ్చన్నారు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత చేపట్టబోతున్న 8వ జనాభా లెక్కల సేకరణ 2021 మార్చి1 అర్ధరాత్రి 12 గంటలకు ముగుస్తుందని అమిత్ షా తెలిపారు. ‘కలం, కాగితం’తో కూడిన జనగణన నుంచి డిజిటల్ డేటా సేకరణ వైపు పరివర్తనం చెందుతున్నట్లు పేర్కొన్నారు. దేశ జనాభా లెక్కలకసరత్తులో ఇదో పెద్ద విప్లవమన్నారు. 
 ఆర్హులందరికీ సన్న బియ్యం సరఫరా

ఈసారి సంపూర్ణ జనగణన కోసం 16 భాషల్లో ఆ కసరత్తును చేపడుతున్నట్లు వివరించారు. జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్)నూ తయారు చేయబోతున్నట్లుప్రకటించారు. ‘‘కొత్తగా తెస్తున్న మొబైల్ యాప్ వల్ల సేకర్తల పని సులభమవుతుంది. జనగణన, ఎన్పీఆర్ తయారీకి ప్రభుత్వం రూ.12వేల కోట్లు ఖర్చు చేయబోతోంది. ఈ కార్యక్రమ ప్రాధాన్యానికిఇదే నిదర్శనం. జనాభా లెక్కల సేకరణలో ఇంకా చాలా మార్పులు తీసుకురావాలి. జనన, మరణాలను ఓటరు జాబితాతో జోడించలేమా? పుట్టిన బిడ్డ వివరాలు నమోదైన వెంటనే జనాభా లెక్కల్లోచేరేట్లు చేస్తే జానాభా లెక్కలు వాటంతటవే తయారుకావా? మరణించిన వ్యక్తి కుటుంబ సభ్యులకు ధ్రువీకరణ ఇచ్చిన వెంటనే ఓటరు జాబితాలో ఆ పేరు ఆటోమేటిక్గా తొలగిపోయేలాచేయకూడదా?’’ అని పేర్కొన్నారు. ‘‘ఆధార్, పాస్పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంకు ఖాతాలు వంటి సేవలను ఒక్క కార్డులోనే ఎందుకు పెట్టలేం? వాటి డేటాను ఒకే కార్డులో పొందుపరిచే వ్యవస్థఉండాలి. ఇది సాధ్యమే. ఇప్పటివరకూ అలాంటి ఆలోచనేదీ ప్రభుత్వ మదిలో లేకపోయినా అటువంటిది సాధ్యమే అని చెబుతున్నా’’ అని అన్నారు.ప్రభుత్వ పథకాలకు ఇదే ప్రాతిపదిక భవిష్యత్లో చేపట్టబోయే ప్రణాళిక, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలకు 2021 జనాభా లెక్కల వివరాలే ప్రామాణికంగా ఉంటాయని అమిత్ షా చెప్పారు. 2011 లెక్కల ఆధారంగా మోదీ సర్కారు22 సంక్షేమ పథకాలకు రూపకల్పన చేసిందన్నారు. జనాభా డేటాను డిజిటల్ రూపంలో నిక్షిప్తం చేయడంవల్ల దాన్ని సాఫ్ట్వేర్ ద్వారా విశ్లేషించుకొని విభిన్న అవసరాలకు ఉపయోగించుకోవడానికి  వీలవుతుందన్నారు. ‘‘2011 లెక్కల ప్రకారం ప్రపంచ జనాభాలో మన వాటా 17.5% అయితే, మన దగ్గరున్న భూభాగం కేవలం 2.4% మాత్రమే. ఈ రెండింటి మధ్య ఉన్న అసమతౌల్యం మనల్ని కన్ను తెరవాలని హెచ్చరిస్తోంది’’ అని పేర్కొన్నారు.అన్ని వివరాలు ‘వాహన్’ డేటాబేస్తో అనుసంధానం!  కొత్త నిబంధనల నేపథ్యంలో పౌరులకు వేధింపులు, ఇబ్బందులను తగ్గించడానికి వాహనాలకు సంబంధించిన అన్ని వివరాలనూ రాష్ట్ర
ప్రభుత్వాలు ‘వాహన్’ డేటాబేస్తో అనుసంధానం చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతూ కేంద్ర రవాణాశాఖ లేఖరాసింది.