మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి ఆహ్వానం
నిర్మల్, సెప్టెంబర్ 24 (way2newstv.com)
ఈ నెల 29 నుంచి ప్రారంభమయ్యే బాసర జ్ఞానసరస్వతి అమ్మవారి శరన్నవరాత్రుల బ్రహ్మోత్సవాలకు రావాలని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని ఆలయకార్యనిర్వహణాధికారి, దేవస్తానం కమిటీ సభ్యులు, ఆలయ పూజారులు ఆహ్వానించారు.
బాసర సరస్వతి దేవి శరన్నవరాత్రులకు రండి
మంగళవారం శాస్త్రినగర్ లోని మంత్రి నివాసంలో ఇంద్రకరణ్ రెడ్డిని కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.బాసర సరస్వతి అమ్మవారి ఆలయ వేద పండితులు, అర్చకులు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని ఆశీర్వదించారు. అమ్మవారి ప్రసాదాన్ని మంత్రికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయకార్యనిర్వహణాధికారి వినోద్, ఆలయ చైర్మన్ శరత్ పాఠక్, అసిస్టెంట్ కమిషనర్ విజయ రామరావు, ప్రధాన అర్చకులు సంజీవ్ కుమార్, వేద పండితులు నందకుమార్ శర్మ,తదితరులు ఉన్నారు.
Tags:
News