సహకార బ్యాంకు బుణాలతో గ్రామీణులు ఆర్థిక అభివృద్ది చెందుతారు. - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

సహకార బ్యాంకు బుణాలతో గ్రామీణులు ఆర్థిక అభివృద్ది చెందుతారు.

జిల్లా కలెక్టర్ డాక్టర్. ఏ.శరత్
జగిత్యాల సెప్టెంబర్ 18  (way2newstv.com)
సహకార బ్యాంకు గ్రామీణుల ఆర్థికాభివృద్ది చెందుటకు పాత్రులు అగుచున్నారని,  సహకార బ్యాంకు రాష్ట్రంలోనే ముందంజలో ఉండుట  అభినందనీయమని జగిత్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్. ఏ.శరత్ ఆన్నారు.  కరీంనగర్ జిల్లాసహకార కేంద్ర బ్యాంక్ లిమిటెడ్ జగిత్యాల శాఖచే మహిళలకు  ఋణం పంపిణి కార్యక్రమం బుదవారం జిల్లా కేంద్రం లోని పోన్నాల గార్డెన్స్ లో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి  జిల్లా కలెక్టర్ డా. ఏ.శరత్ ముఖ్య అతిధిగా పాల్గోన్నారు.  ఈసందర్బముగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ మహిళకుఋణం అందిసే ఆదర్శంగా నిలుస్తున్నది సహకారబ్యాంక్ అన్నారు.  గ్రామీణ వ్యవస్థ బాగుపడాలంటేబ్యాంకులు ముందుకు వచ్చిడబ్బులు  ఇస్తే గ్రామీణవ్యవస్థ ఉపాధి బాగుపడునని వారి కుటుంబాలుఆర్థికాభి వృద్ధి చెందునన్నారు.    
సహకార బ్యాంకు బుణాలతో గ్రామీణులు ఆర్థిక అభివృద్ది చెందుతారు. 

సహకార బ్యాంకుగ్రామీణులకు ఆర్థికాభివృద్ది చెందుటకు పాత్రులుఅగుచున్నారని,  సహకార బ్యాంకు రాష్ట్రంలోనేముందంజలో ఉండుట  అభినందనీయమన్నారు.  200వందల కోట్లు ఉన్న దానిని 3వేల కోట్లకుపెరిగిందన్నారు.   బ్యాంకు లాభాల బాటలోనడుచుటకు చైర్మన్ ఎంతో కృషిచేస్తున్నారన్నారు.  జిల్లాలో మహిళలకు కోటియాబై లక్షల ఋణం అందించారు.  జగిత్యాల మహిళలకు ఎక్కువఋణం ఇచ్చినను తప్పక మంచిగా ఋణవాయిదాలు తప్పక మహిళలు చెల్లించుతారని వారిఎలాంటి ఇబ్బంది లేకుండా బ్యాంకువారు ఋణం మంజూరు చేయాలని అన్నారు.   జిల్లాలో గోడౌన్స్తక్కువ ఉన్నాయని బ్యాంకు వారు గోదాంలకుఋణం ఇస్తామని అన్నందున  ప్రతి మండలానికిఒక  గోదాముకు ప్రతిపాదనలు సిద్దంచేయాలని డిఆర్డీఏ ను ఆదేశించారు.  జిల్లాలో ఉత్తేజంకార్యక్రమము ద్వారా ప్రభుత్వ పాఠశాలలో చదివే పేదవిద్యార్థులకు పాఠశాల ప్రారంభమునకు ఉదయంఒక గంట పాఠశాల అనంతరం సాయంత్రం ఒక గంటప్రత్యేక తరగతులు జిల్లాలో ఉపాద్యాయులు మెటిరియల్ ఉదయం టిఫిన్, ఖర్చు అగుచున్నదిఅట్టి ఖర్చు గ్రామాలలోని ఉపాద్యాయులు, విద్యార్థుల తల్లితండ్రులు తో నడిపి మూడుసంవత్సరాలు రాష్ట్రములో జిల్లా మొదటి స్థాంవచ్చినదని అన్నారు.  అలాంటి పేద విద్యార్థులు చదువుచున్నారని  66 పాఠశాలలను దత్తతతీసుకోని ఉండాలని బ్యాంకు చైర్మన్ కి సూచించారు.  ఆ విధముగా తీసుకొని చేస్తేపేదవారిని ఆదుకున్నట్లు ఉంటుందని విద్యార్థులకుమంచి విద్యాబోదన అందిన మీ శాఖ ద్వారా అందినవారు  అగుదురన్నారు. కరీంనగర్ జిల్లా సహకార చైర్మన్  కోడూరిరవీందర్ రావు మాట్లాడుతూ  జిల్లాలో 19కోట్ల 40లక్షల వరకు ఋణాలు అందించినట్లు తెలిపారు. మంచి  సంఘాలు పనిచేసే వారికి ఋణం పొందివాటిని సద్వినియోగం చేయు సంఘాలకు  తప్పకఋణం మంజూరు చేస్తామని అన్నారు.   సహకారంఅంటేనే పరస్పరం సహకారం చేయుట అందుకుఎప్పుడు మీకు సహయ సహకారాలు ఆందించుననిఅన్నారు.  తీసుకున్న ఋణంతో మీరు అభివృద్దిచెందాలన్నదే  ప్రభుత్వ లక్ష్యం అన్నారు.  ఈ బ్యాంకుమన అందరికి అందుకే మీకు సహయ సహకారాలుఅందించుచున్నామన్నారు.ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడి  బిక్షపతి, అదనపు పిడి సతీష్,   ఎల్ డి ఎం లక్ష్మీనారాయణ,  కేడిసీసీ బ్యాంకు డైరెక్టర్ గంగాధర్,  బ్యాంకు సిబ్బందిపాల్గోన్నారు.