కుక్కల కంటే ఇంత హీనమా.. - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కుక్కల కంటే ఇంత హీనమా..

హైద్రాబాద్, సెప్టెంబర్ 14, (way2newstv.com)
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసంలో హస్కీ అనే 11 నెలల శునకం ఇటీవల చనిపోయింది. దీంతో పశు వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే కుక్క చనిపోయిందని బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదుచేశారు. ఆసుపత్రిలో డాక్టర్ రంజిత్, నిర్వాహకురాలు లక్ష్మీలపై కేసు పెట్టారు. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై వెటకారంగా స్పందించారు.ఓవైపు ప్రజలు అల్లాడుతుంటే పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, కుక్క చనిపోతే మాత్రం పోలీస్ కేసులు పెడుతున్నారని దుయ్యబట్టారు. ప్రగతి భవన్ లో కుక్కకు ఉన్న విలువ కూడా బంగారు తెలంగాణలో మనుషులకు లేదా? అని నిలదీశారు. ఈ మేరకు ట్విట్టర్ లో స్పందించిన రేవంత్ రెడ్డి... రాష్ట్రంలో ప్రజలు జ్వరాలతో అల్లాడుతున్న పత్రికల కథనాలను పోస్ట్ చేశారు. 
 కుక్కల కంటే ఇంత హీనమా..

అలాగే తన ట్వీట్ కు తెలంగాణ సీఎం కార్యాలయం, రాష్ట్ర ఆరోగ్య శాఖలను ట్యాగ్ చేశారు.యురేనియం తవ్వకాల వ్యవహారంలో మంత్రి కేటీఆర్‌పై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి సెటైర్ వేశారు. నాటకాలు కట్టిపెట్టాలనీ.. యురేనియం తవ్వకాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను రద్దు చెయ్యాలని డిమాండ్ చేశారు. మంత్రి కేటీఆర్‌ను ట్యాగ్ చేస్తూ ఈ మేరకు ట్వీట్ చేశారు. నల్లమలలో యురేనియం తవ్వకాల అంశం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే.ఈ అంశంపై పలువురు ప్రముఖులు, సినీ సెలబ్రిటీలు ఇప్పటికే స్పందించారు. యురేనియం తవ్వకాలను విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఈ వ్యవహారంలో ప్రజల ఆవేదనను పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. వ్యక్తిగతంగా ఈ విషయాన్ని సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇస్తూ  ట్వీట్ చేశారు.కేటీఆర్ చేసిన ట్వీట్‌పై రేవంత్ రెడ్డి స్పందించారు. ‘‘కెటిఆర్ గారు ,‘సురభి నాటకాలు కట్టిపెట్టండి. యురేనియం తవ్వకాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను రద్దు చెయ్యండి’’ అని ఆయన ట్వీట్ చేశారు.