హైదరాబాద్ సెప్టెంబర్ 24 (way2newstv.com)
బ్యాంకు ఉద్యోగులు చేపట్టిన రెండు రోజుల సమ్మె వాయిదాపడింది. బ్యాంకులను విలీనం చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకంగా ఈ నెల 26 నుంచి 27 వరకు సమ్మె చేయాలని యోచించిననాలుగు బ్యాంకింగ్ ఉద్యోగ సంఘాలు కేంద్ర ఆర్థిక కార్యదర్శి రాజీవ్ కుమార్ ఇచ్చిన హామీతో మెత్తపడ్డారు.
బ్యాంకు ఉద్యోగులు సమ్మె వాయిదా
ఈ విలీనంతో ఎదురవనున్న సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేస్తామని కుమార్ హామీ ఇవ్వడంతో సమ్మెను వాయిదా వేయాల్సి వచ్చిందని ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి