వానలు పడుతున్న పెరగని గ్రౌండ్ వాటర్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

వానలు పడుతున్న పెరగని గ్రౌండ్ వాటర్

హైద్రాబాద్, సెప్టెంబర్ 13, (way2newstv.com)
ఈ ఏడాది వానలు ఆలస్యంగా వచ్చినా బాగానే పడుతున్నాయి. జులై, ఆగస్ట్  నెలల్లో పడిన వర్షాలు లోటును భర్తీ చేశాయి. సిటీలో వానలు బానే పడుతున్నా….గ్రౌండ్ వాటల్ లెవల్స్ లో మార్పురావడం లేదు. వాస్తవానికి వర్షాలు కురిస్తే వాటర్ లెవెల్ పెరగాలి… కానీ సిటీలో ఎందుకు రిజల్ట్ కనిపించడం లేదు. ఎండాకాలంలో మామూలుగానే భూగర్భ జలాల నీటి మట్టం తగ్గుతుంది. కానీ ఈఏడాది మరింతగా పడిపోయింది. ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు చాలా ప్రాంతాల్లో బోర్లలో చుక్కనీరు లేని పరిస్థితి. 4, 5 నెలల పాటు వాటర్ ట్యాంకర్ల కోసం చాలా వేల రూపాయలు ఖర్చు చేశారు జనం.ఆ తరువాత వర్షాలు బానే కురిశాయి. కానీ భూగర్భ జలాలు మాత్రం ఆశించిన స్థాయిలో పెరగలేదు. నీరు భూమిలోకి ఇంకకపోవడమే ఇందుకు కారణమంటున్నారు అధికారులు.
వానలు పడుతున్న పెరగని గ్రౌండ్ వాటర్

కాంక్రీట్ జంగిల్ గామారిన హైదరాబాద్లో వర్షపు నీరు ఇంకే పరిస్థితి లేదు. అందుకే ఎంత వర్షం పడినా… గ్రౌండ్ వాటర్ లెవల్ పెరగడం లేదంటున్నారు అధికారులు. జనాభా ఎక్కువగా ఉండే ఏరియాల్లో వాటర్ లెవల్స్దారుణంగా పడిపోతున్నాయి. అమీర్ పేట్, కూకట్ పల్లి, ఖైరతాబాద్, సనత్ నగర్, వెస్ట్ మారేడ్ పల్లి ఏరియాల్లో ఎండాకాలంలో వాటల్ లెవల్స్ బాగా తగ్గాయి. మూసీ నదికి ఆనుకుని ఉన్నఏరియాల్లో గ్రౌండ్ వాటర్ లెవల్స్ కొద్దిగా మెరుగ్గా ఉన్నాయి. బహదూర్ పురా, అంబర్ పేట్, చార్మినార్, హిమాయత్ నగర్, హయత్ నగర్ వంటి ఏరియాల్లో వాటర్ లెవల్స్ ఆశించిన స్థాయిలోఉన్నాయి.వర్షపు నీటిని ఒడిసి పడదాం… భూగర్భ జలాలను కాపాడుదాం.. అనే నినాదాన్ని తీసుకొచ్చింది గ్రౌండ్ వాటర్ డిపార్ట్ మెంట్. అయితే ఆచరణ లోపంతో ఫలితాలు మాత్రం ఆశించినస్థాయిలో లేవు. ప్రభుత్వం చెరువుల పూడికతీత వంటి కార్యక్రమాలు చేస్తున్నా… భూగర్భ జలాల పెరుగుదలలో మార్పు రావడం లేదు. జిల్లాల్లో వర్షపు నీరు వృథా కావడం లేదు. 2, 3 నెలల్లోసమృద్ధిగా భూగర్భ జలాలు పెరిగినట్లు అధికారులు చెప్తున్నారు. నాయకులు, అధికారులు, ఎన్జీవోలు.. కలిసి ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయాలంటున్నారు పర్యావరణ వేత్తలు. లేదంటే.. మరో 4,5 ఏళ్లలో.. పరిస్థితులు మరింత దారుణంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు.