నేను జెండా ఓనరే : నాయని - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

నేను జెండా ఓనరే : నాయని

హైద్రాబాద్, సెప్టెంబర్ 9(way2newstv.com)
తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ అనంతరం టీఆర్‌ఎస్ పార్టీలో లుకలుకలు బయటపడుతున్నాయి. కేబినెట్ విస్తరణలో తనకు అవకాశం దక్కకపోవడంతో రాష్ట్ర హోంశాఖ మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ అధిష్టానంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట తప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఏ కార్పొరేషన్ పదవి అక్కర్లేదన్నారు. సోమవారం  హైదరాబాద్‌లోని తన నివాసంతో మీడియాతో చిట్‌టాట్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు.నాయినీ నర్సింహా రెడ్డికి కార్పొరేషన్ ఛైర్మన్‌గా త్వరలో పదవి ఇవ్వబోతున్నారనే వార్తలపై ఆయన స్పందించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ముషీరాబాద్ టికెట్ అడిగితే ‘ముఠా గోపాల్ ను గెలిపించుకురా.. మంత్రిని చేస్తా’ అని కేసీఆర్ హామీ ఇచ్చారని నాయినీ చెప్పారు. 
నేను జెండా ఓనరే : నాయని

ఆ సమయంలో తన అల్లుడు శ్రీనివాస్ రెడ్డికైనా టికెట్ ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. కానీ, అవేమీ జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన అల్లుడికి ఎమ్మెల్సీ పదవి ఇస్తానని కూడా ఇవ్వలేదని చెప్పారు.‘ఇప్పుడు నాకు ఏ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి వద్దు. రాష్ట్ర హోం శాఖ మంత్రిగా పనిచేసిన నాకు ఇప్పుడు కార్పొరేషన్ ఛైర్మన్ పదవి ఇస్తానంటే.. అది ఎవరికి కావాలి’ అని నాయిని అన్నారు. ‘టీఆర్ఎస్ పార్టీలో నేను కూడా ఓనర్‌నే. కేసీఆర్ మా ఇంటికి పెద్ద. కిరాయిదార్లు ఎప్పుడు దిగిపోతారో తెలియదు’ అంటూ నాయినీ ఘాటు వ్యాఖ్యలు చేశారు.2014లో రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో పార్టీ సీనియర్ నేత నాయినీకి హోం మంత్రి పదవి ఇచ్చి గౌరవించారు గులాబీ దళపతి. రెండో పర్యాయం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయణ్ని మంత్రివర్గంలోకి తీసుకోకపోవడం హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా కేబినెట్ విస్తరణలోనూ చోటు దక్కకపోవడంతో ఆయన అసంతృప్తి పెరిగింది. ప్రస్తుతం నాయిని ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. మంత్రివర్గ విస్తరణపై అటు మాజీ డిప్యూటీ సీఎం, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రాజయ్య కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.