పవన్ వన్ సైడ్ పాలిటిక్స్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పవన్ వన్ సైడ్ పాలిటిక్స్

విజయవాడ, సెప్టెంబర్ 17, (way2newstv.com)
పవన్ కళ్యాణ్ కొత్తరకం రాజకీయం చేస్తానంటూ చెప్పుకొచ్చారు కానీ ఆచరణలో మాత్రం అయన అందుకు భిన్నంగా అడుగులు వేస్తున్నట్లుగా పలు సందర్భాలలో స్పష్తమైంది. ముఖ్యంగా వన్ సైడ్ పాలిటిక్స్ పవన్ చేస్తారని పేరు తెచ్చుకున్నారు. జగన్ మీద దాడి చేయమంటే పెద్ద నోరు వేసుకుంటారని, అదే చంద్రబాబును అనాలంటే మాత్రం ఒకటికి పదిమార్లు ఆలొచిస్తారని పవన్ కళ్యాణ్ మీద అపుడే ముద్ర పడిపోయింది కూడా. పవన్ కళ్యాణ్ చంద్రబాబు కు మద్దతుగా 2014 ఎన్నికల్లో దిగినపుడే ఆయన వైసీపీకి వ్యతిరేకం అని ఆ పార్టీ నాయకులు భావించారు. ఆ దూరం అలా కొనసాగుతోంది. 
పవన్ వన్ సైడ్ పాలిటిక్స్

పవన్ కళ్యాణ్ సైతం టీడీపీతో దగ్గరగా ఉంటున్నారని, ఆ పార్టీ గొంతుక వినిపిస్తున్నారని వైసీపీ మంత్రులు సైతం ఆరోపిస్తున్న సందర్భం ఇపుడు సాగుతోంది.పవన్ కళ్యాణ్ లక్ష కోట్ల మాట మరచిపోలేదా అనిపిస్తుంది ఆయన తాజా వ్యాఖ్యలను గమనిస్తే. జగన్ లక్ష కోట్లు దోచేశాడని టీడీపీ పదేళ్ళుగా నానా యాగీ చేసింది. అయితే అందులో పస ఎంత ఉందన్నది ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ మంత్రులు దాడి వీరభద్రరావు, మైసూరారెడ్డి గుట్టు విప్పారు కూడా. పెద్ద నంబర్ అయితే బాగుంటుందని ఆ అంకె వేశామని వారే చెప్పారు కూడా. ఇవన్నీ ఇలా ఉంటే సీబీఐ జగన్ మీద పదకొండు చార్జిషీట్లు వేసినా కూడా మొత్తానికి తేల్చింది 48 వేల కోట్లేనని కూడా అందరికీ తెలిసిందే. అయితే అవి కూడా కాదని జగన్ కేసులు 1200 కోట్ల వరకూ మాత్రమే ఉన్నాయని జనసేనలో చేరిన అప్పటి సీబీఐ అధికారి జేడీ లక్ష్మీ నారాయణ చెప్పుకొచ్చారు. ఆయన ఎన్నికల ముందు ఈ మాట అనలేదు, ఎన్నికలు అయిన తరువాత చెప్పారు, ఎపుడు చెప్పినా కూడా ఆయన మాటకు విలువ ఉంటుందనుకోవాలి. మరి తన పార్టీలో ఉన్నాయన, సీబీఐ కేసును స్వయంగా విచారించిన అధికారి మాటను కూడా పవన్ కళ్యాణ్ పట్టించుకోరా. లక్ష కోట్లు జగన్ దోచేశాడని ఎలా ఇప్పటికీ అంటున్నారని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఏపీలో పెట్టుబడులు రాకుండా జగన్ విధానాలు ఉన్నాయని, పారిశ్రామికవేత్తలు ఏపీ నుంచి వెళ్ళిపోతే పెట్టుబడులు ఎలా వస్తాయంటూ పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఒకవేళ‌ పారిశ్రామికవేత్తలు వెళ్లిపోతే జగన్ తాను దోచుకున్న లక్ష కోట్లు ఏపీలో పెట్టుబడులు పెడతారా అనిపవన్ కళ్యాణ్ గట్టిగానే ప్రశ్నించారు. పెట్టుబడుల విషయంలో పవన్ కళ్యాణ్ విమర్శల వరకూ బాగానే ఉన్నా జగన్ లక్ష కోట్లు దోచుకున్నారని అనడమే మళ్లీ అగ్గి రాజేస్తోంది. లక్ష కోట్లు ఎక్కడ ఉన్నాయి. అవి ఒకవేళ ఉన్నాయని భావిస్తే మీరు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టి మొత్తం ఇచ్చేస్తానని జగన్ ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలోనే నాటి టీడీపీ సర్కార్ కి సవాల్ కూడా చేశారు. దానికి జవాబు కూడా వారు చెప్పలేకపోయారు. మరి ఇన్ని రకాలుగా నలిగి నీరుకారిపోయిన లక్ష కోట్లను మళ్ళీ ఆరోపిస్తున్నారంటే పవన్ కళ్యాణ్ జగన్ ని బాగా కెలకాలనే నిర్ణయించుకున్నారని అంటున్నారు.