కడప, సెప్టెంబర్ 17, (way2newstv.com)
కడప జిల్లా వ్యాప్తంగా వర్షం కురిసింది. దాంతో కుందూ, పెన్నా నదులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. పెద్దముడియం గరిశలూరు, నెమల్ల దిన్నె గ్రామాల్లో వరద నీరు పోటెత్తింది. పెద్దముడియం పోలీస్ స్టేషన్ లోకి నీరు చేరింది. నెమల్ల దిన్నె బ్రిడ్జిపై కుందూ నది నాలుగు అడుగుల మేర ప్రవహించింది.
కడప జిల్లా వ్యాప్తంగా వర్షం
పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పెద్దముడియం జంగాలపల్లె కొట్టాలపల్లి, ఉప్పలూరు, గూడూరు, చిన్నముడియం, నెమల్ల దిన్నె, ఏలూరు గ్రామాలకు రాకపోకలు స్థంభించాయి. గండికోట జలాశయానికి ఇన్ ఫ్లో 14 వేల క్యూసెక్కులు, మైలవరం జలాశయానికి ఇన్ ఫ్లో14 వేల క్యూసెక్కులు నమోదయ్యాయి. ఐదు క్రస్ట్ గేట్లను ఎత్తివేసి పెన్నా నదికి 12 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేసారు. ప్రొద్దుటూరు మండలం రాధానగర్ వద్ద.. కుందూనదిపై రోడ్డు దాటుతూ ఆటో వరదలో కొట్టుకుపోయింది. ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు.