కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలి

 కదం తొక్కిన న్యాయవాదులు
ఎమ్మిగనూరు సెప్టెంబర్ 23  (way2newstv.com)
కర్నూలు జిల్లాలో హైకోర్టును ఏర్పాటు చేయాలన్న డిమాండ్తో న్యాయవాదులు,  కదం తొక్కారు. శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమకు న్యాయం చేయాలని పట్టణంలో  ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కోర్టు ఆవరణ నుంచి సోమప్ప కూడలి వరకు ప్రదర్శన నిర్వహించి అక్కడ మానవహారం ఏర్పాటు చేశారు. ఆ తర్వాత అక్కడే ఏర్పాటు చేసిన శిబిరంలో ధర్నా నిర్వహించి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మిగనూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నారాయణ మాట్లాడుతూ శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమలో హై కోర్టు ఏర్పాటు చేయాలని అన్నారు.
కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలి

ఆ ఒప్పందాన్ని ఖాతరు చేయకుండా గత ప్రభుత్వం రాజధానితో పాటు హైకోర్టును కూడా అమరావతిలోనే ఏర్పాటు చేసి రాయలసీమకి అన్యాయం చేసిందని విమర్శించారు.సీనియర్  న్యాయవాదులు మాట్లాడుతూ రాయలసీమ అభివృద్ధి చెందాలంటే అధికార వికేంద్రీకరణ జరగాలని అన్నారు. కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేస్తే సీమ వాసులకు న్యాయం జరుగుతుందని తెలిపారు.వెంకట రామిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన ప్రాంతం రాయలసీమ అని, హైకోర్టు ఏర్పాటుకు కర్నూలు అనువైన ప్రదేశమని,వెంటనే ఇక్కడికి హైకోర్టును తరలించాలని డిమాండ్ చేశారు. రామకృష్ణ నాయుడు మాట్లాడుతూ అధికార వికేంద్రీకరణతోనే రాయలసీమ అభివృద్ధి సాధ్యమని అందులో భాగంగానే కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.శ్రీకాంత్ మాట్లాడుతూ దశాబ్దాలుగా రాయలసీమ ప్రాంతం అన్యాయానికి గురవుతోందని, కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయకపోతే తమ ఉద్యమం మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.కర్నూలులో హైకోర్టు ఏర్పాటు సీమవాసుల మనోభావాలకు సంబంధించిన విషయమని అన్నారు. ప్రభుత్వం గౌరవించి రాయలసీమకు న్యాయం చేయాలని కోరారు.ఆనంద్ మాట్లాడుతూ ఇది ఆఖరి పోరాటం అని, తరతరాలుగా సీమకు అన్యాయం జరుగుతోందని విమర్శించారు. ర్యాలీలో బార్ అసోసియేషన్ సభ్యులు యాంకన్న,దామోదర రెడ్డి,పరమేషప్ప,నల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.