విజయవాడ, సెప్టెంబర్ 23, (way2newstv.com)
ఏపీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి కొత్త అధ్యక్షుడు రానున్నారు. ఇప్పటికే ఒక జాబితా ఏపీ నుంచి ఢిల్లీలోని కాంగ్రెస్ వ్యవహారాలు చూస్తున్న మాజీ అధ్యక్షురాలు (ప్రస్తుతం అధ్యక్షులు ఎవరూ లేరు.రాహుల్ రాజీనామా తర్వాత ఎవరినీ ఎన్నుకోలేదు) సోనియాగాంధీకి చేరిపోయింది. త్వరలోనే ఏపీలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కొత్త పీసీసీ అధ్యక్షుడి ఎన్నిక అనివార్యంగామారిపోయింది. 2012లో రాష్ట్ర విభజన తర్వాత ఏపీ, తెలంగాణలకు కొత్త అధ్యక్షులను నియమించారు.ఈ క్రమంలోనే అనంతపురానికి చెందిన రఘువీరారెడ్డికి ఈ పదవి దక్కింది. ఈయనహయాంలో రెండు సార్లు ఎన్నికలు జరిగాయి.2014లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క సీటును కూడా దక్కించుకోలేక పోయింది.
ఏపీలో కొత్త పీసీసీ ఛీఫ్
మధ్యలో 2017లో నంద్యా లకు జరిగిన ఉప ఎన్నికల్లోనూకాంగ్రెస్ పుంజుకోలేక పోయింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికల్లో ఎట్టిప రిస్థితిలో విజయం సాధించాలని నిర్ణయించుకున్న కాంగ్రెస్ గౌరవ ప్రదమైన స్థానాలనుదక్కించుకుని ప్రతిపక్ష హోదా చిక్కించుకోవాలని అనుకుంది. అయితే, అనూహ్యంగా అది కూడా సాధ్యం కాలేదు. పైగా పార్టీలో ఉన్న పనబాక లక్ష్మి వంటి సీనియర్లు కూడా పార్టీ మారిపోయారు.వాస్తవానికి ఈ ఎన్నికలకు ముందు పార్టీని బలోపేతం చేసుకునేందుకు ఘర్‌వాపసీ పిలుపు ఇచ్చినా.. కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లిపోయిన వారిని తిరిగి రప్పించుకోవడంలోరఘువీరారెడ్డివిఫలమయ్యారు.ఇక, దేశవ్యాప్తంగా కూడా 2014తో పోల్చుకుంటే కాంగ్రెస్ ఘోరంగా పరాజయం పాలైంది. ఈ క్రమంలోనే పార్టీకి అధ్యక్షుడుగా ఉన్న రాహుల్ గాంధీ తనపదవికి రాజీనామా చేశారు.ఈ విషయంలో అనేక రూపాల్లో ఆయనకు అభ్యర్థనలు వచ్చినా.. ఆయన తన పంతం వీడలేదు. దీంతో రాహుల్‌కు సంఘీభావంగా వివిధ రాష్ట్రాల్లో పీసీసీ అధ్యక్షులు రాజీనామా చేశారు. ఈ క్రమంలోనేరఘువీరా కూడా రాజీనామా చేశారు. దీంతో ఏపీ పీసీసీ అధ్యక్ష పదవి ఖాళీగా ఉంది. అయితే, త్వరలోనే రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగే అవకాశం ఉన్న నేపథ్యంలో అధ్యక్ష పదవిని భర్తీచేయాలని కాంగ్రెస్ భావిస్తోంది.ఈ క్రమంలోనే సీనియర్ల జాబితాను ఒడబోసే కార్యక్రమానికి తెరదీశారు. దీంతో అనంతపురానికి చెందిన సింగనమల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, మంత్రి, దళితనాయకుడు సాకే శైలజానాథ్ పేరు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. అదే సమయంలో తులసిరెడ్డి పేరుకూడా ఈ జాబితాలో ఉన్నప్పటికీ.. ప్రజలను ఆకట్టుకునే విషయంలో ఆయనకు మైనస్మార్కులు పడడంతో కాంగ్రెస్ సాకే వైపు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. ఇప్పుడున్న ఈక్వేషన్ల నేపథ్యంలో కూడా సాకేకే పగ్గాలు ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఏంజరుగుతుందో ? చూడాలి.