బోటు ప్రమాదంపై అధికారులతో సీఎం జగన్ సమీక్ష - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

బోటు ప్రమాదంపై అధికారులతో సీఎం జగన్ సమీక్ష

దేవీపట్నం సెప్టెంబర్ 16 (way2newstv.com)
తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం సమీపంలో బోటు ప్రమాద సంఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్  రెడ్డి సీరియస్ అయ్యారు. గల్లంతైన వివరాలు తెలియక వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులను పరామర్శించిప్పుడు వారు చెబుతున్న మాటలు విని చాలా బాధ పడ్డానన్నారు. ప్రమాద ఘటనపై రాజమండ్రి సబ్ కలెక్డర్ కార్యాలయంలో మంత్రులు, ఎమ్మెల్యేలతో సమీక్ష నిర్వహించారు. లాంచీ ప్రమాద ఘటనపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. గల్లంతైన వారి మృతదేహాలను వెలికి తీసేందుకు ఏం చర్యలు తీసుకున్నారని అధికారుల ద్వారా తెలుసుకున్నారు. లాంచీ ప్రమాదం ఎలా జరిగిందని, సహాయక చర్యలు ఎలా జరుగుతున్నాయని ఆరా తీశారు. 
బోటు ప్రమాదంపై  అధికారులతో సీఎం జగన్ సమీక్ష

గోదావరి నది లోపల 300 అడుగుల లోతులో లాంచీ మునిగిందని అధికారులు సీఎం జగన్ తెలిపారు. మునిగిన లాంచీని వెంటనే వెలికి తీసేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.విచారణ కోసం ప్రత్యేక కమిటీ : ప్రమాద ఘటనపై విచారణ కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కమిటీ చైర్మన్ గా  ఇరిగేషన్ స్పెషల్ ఛీప్ సెక్రటరీ, సభ్యులుగా రెవెన్యూ ఛీఫ్ సెక్రటరీ, టూరిజం ప్రిన్సిపల్ సెక్రటరీ, లా అండ్ ఆర్డర్ అదనపు డిజీ, తూర్పుగోదావరి కలెక్టర్లు ఉన్నారు. మూడు వారాల్లో నివేదిక ఇవ్వాలని, 45 రోజుల్లో చర్యలు ఉండాలని ఆదేశించారు. సమీక్షలో తెలంగాణా మంత్రులు ఎర్రబెల్లి దయాకర రావు, అజయ్ కుమార్, ఏపి ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, హోం మంత్రి సుచరిత, పిల్లి సుభాష్ చంద్ర బోస్, మంత్రులు కన్నబాబు, పినిపే విశ్వరూప్, తానేటి వనిత, అవంతి శ్రీనివాస రావు, అనీల్ కుమార్ యాదవ్, శ్రీరంగనాధరాజు, ఎంపిలు భరత్, వంగా గీత, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. ళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.