బెజవాడకు లైట్ మెట్రో దిశగా అడుగులు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

బెజవాడకు లైట్ మెట్రో దిశగా అడుగులు

విజయవాడ, సెప్టెంబర్ 10, (way2newstv.com)
 లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టు ఫైనల్‌ డీపీఆర్‌ నెలలో ప్రభుత్వానికి అందించటానికి అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ (ఏఎంఆర్‌సీ) సన్నాహాలు చేస్తోంది. మొత్తం ప్రతి పాదించిన రూ. 25 వేల కోట్లవ్యయంలో ఒక్క అమరావతి రాజధానికి 27 కిలో మీటర్ల దూరానికే రూ. 12,500 కోట్ల ఖర్చుగా చూపించారు. రాజధానికి అండర్‌ గ్రౌండ్‌ విధానంలో మెట్రో నిర్మించాల్సిన అవసరం ఏముందని,ఎర్త్‌ గ్రేడ్‌ విధానంలోనే ముందుకు వెళ్ల్లచ్చు కదా అని సీఎం ప్రశ్నించారు. ఎర్త్‌గ్రేడ్‌ విధానంలో వెళితే కిలోమీటర్‌కు రూ. 100 కోట్ల లోపే ఖర్చు అవుతుంది. ఈ విధానంలో రాజధాని వరకు రూ.2,700 కోట్లకు మించి ఖర్చు కాదన్నది ప్రభుత్వ ఆలోచన. ప్రభుత్వం ముందుగా వాస్తవ అవసరాల ప్రాతిపదికన మెట్రో ప్రాజెక్టును నిర్మించాలని భావిస్తోంది.
 బెజవాడకు లైట్ మెట్రో దిశగా అడుగులు

ఇటీవల సీఎం జగన్‌ అధ్యక్షతన జరిగినసమావేశం నేపథ్యంలో, తుది డీపీఆర్‌పై ఏఎంఆర్‌సీ దృష్టి సారించింది. వాస్తవాలకనుగుణంగా ఖర్చు ఉండాలన్న దానిపై సీఎం జగన్‌ ఏఎంఆర్‌సీ అధికారుల నుద్దేశించి ప్రతిపాదనలు ఉండాలనిసూచించిన సంగతి తెలిసిందే. ప్రధానంగా అమరావతి రాజధాని ప్రాంతంలో అండర్‌ గ్రౌండ్‌ మార్గం పేరుతో కిలోమీటర్‌కు రూ. 450 కోట్ల ఖర్చును ప్రతిపాదించటంపై సీఎం విస్మయంప్రకటించారు.ప్రజావసారాలను తీర్చేదిగా డీపీఆర్‌లో సవరించాల్సిందిగా సీఎం సూచించినట్లు తెలిసింది. అందుకనుగుణంగా ఏఎంఆర్‌సీ అధికారులు చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ముందుగావిజయవాడలోనే మెట్రో ఉంటుంది. అది కూడా గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి కాకుండా నిడమానూరు నుంచి ఏలూరు రోడ్డు మీదుగా రైల్వే స్టేషన్‌, పీఎన్‌ఎబీఎస్‌ వరకు కారిడార్‌ - 1, పెనమలూరుసెంటర్‌ నుంచి పీఎన్‌బీఎస్‌ వరకు బందరు రోడ్డు మీదుగా కారిడార్‌ - 2 లు మాత్రమే ఉండే అవకాశాలున్నాయి. సీఎం వైఎస్‌ జగన్‌ సూచనల మేరకు నెలలో డీపీఆర్‌లో మార్పులు చేసి ప్రభుత్వానికినివేదిక సమర్పించిన తర్వాత మెట్రోను ఏ విఽధానంలో ముందుకు తీసుకు వెళతరా..ఈ రైల్‌ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ముందుకు తీసుకెళ్లనున్నారు