అందరూ బాధ్యతగా మొక్కలు పెంచాలి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అందరూ బాధ్యతగా మొక్కలు పెంచాలి

జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. శరత్
జగిత్యాల సెప్టెంబర్10 (way2newstv.com)
ప్రతి ఒక్కరూ తప్పక మొక్కలు నాటాలని నాటిన  మొక్కలను పరిరక్షించుకోవాలని, అప్పుడే పర్యావరణంలో మార్పులు వస్తాయని జగిత్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్ .ఏ. శరత్ అన్నారు. జిల్లాలో హరితహారంలో భాగంగా మంగళవారం  జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. శరత్ ముఖ్యఅతిథిగా పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగాకలెక్టర్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటారు. కాలనీలోని వీధులలో ను మరియు గృహములలో పచ్చదనం వెల్లువిరుస్తుందన్నారు.
అందరూ బాధ్యతగా మొక్కలు పెంచాలి

కాలనీలోని ప్రతి ఇంటిలోనూ  స్థలాన్ని బట్టి 6 మొక్కలు తప్పక నాటాలని నాటిన ప్రతి మొక్కను పరిరక్షించుకోవాలని ఇది అందరు బాధ్యతగా మొక్కలు పెంచాలని అప్పుడే పర్యావరణంలోమార్పులు వస్తాయని అన్నారు. కాలనీలో ఖాళీగా ఉన్న స్థలాలలో నిస్థల యజమానులకు మున్సిపాలిటీ ద్వారా నోటీసులు ఇచ్చి కాళీ స్థానములలో పిచ్చి మొక్కలు లేకుండా శుభ్రపరిచి, కాళీస్థలాలలో నీరు నిలవకుండా చూడాలని యజమానులను ఆదేశించే వలసి యున్నది అన్నారు. ఖాళీ స్థలంలో మొక్కలను నాటాలని అన్నారు. మున్సిపాలిటి వారిచే ప్రతి ఇంటికి కృష్ణ తులసిమొక్కలు సరఫరా చేస్తారని ఆ మొక్కలు వారి వారి ఇంటిలో తప్పక నాటి పెంచాలని వాటివల్ల దోమలు ఉండవని అన్నారు. కోతులు గృహం లోకి రాకుండా కాలనీ బయట ప్రదేశంలో కాలిగా ఉన్నాస్థలాలలో పండ్ల మొక్కలు పెంచాలని కాలనీ వారికి సూచించారు. అనంతరం కాలనీవాసులు కలెక్టర్ ని శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రవిబాబు, ఎస్సీ ఈ.డిలక్ష్మీనారాయణ, అటవీశాఖ సిబ్బంది సదానందం, హౌసింగ్ బోర్డు కాలనీ వాసులు అందరూ పాల్గొన్నారు.