తూర్పు, కడపల్లో పార్టీ ఖాళీయేనా - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

తూర్పు, కడపల్లో పార్టీ ఖాళీయేనా

కాకినాడ, సెప్టెంబర్ 17, (way2newstv.com)
అసెంబ్లీ ఎన్నిక‌ల్లో దారుణ ప‌రాజ‌యంపాలైన టీడీపీ ఇప్పుడు కునికిపాట్లు ప‌డుతోంది. ఆ పార్టీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు షాకుల‌మీద షాకులు త‌గులుతున్నాయి. ఎప్పుడు ఎవ‌రు పార్టీని వీడుతారో తెలియ‌క ఆయ‌న ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇప్ప‌టికే ప‌లువురుకీల‌క నేత‌లు బాబుకు బైబై చెప్పారు. ఇక తాజా విష‌యానికి వ‌స్తే.. రెండు జిల్లాలు తూర్పుగోదావ‌రి, క‌డ‌పలో టీడీపీ ఇక గ‌ల్లంతేన‌నే టాక్ వినిపిస్తోంది. ఇప్ప‌టికే ఈ రెండు జిల్లాలో ప‌లువురు కీల‌క నేత‌లు పార్టీని వీడారు. ఇటీవల తూర్పు గోదావరిలో వరుపుల రాజా టీడీపీకి గుడ్ బై చెప్పేశారు. ఆయన వైసీపీలో చేర‌డం ఖాయం. తాజాగా అదే జిల్లాకు చెందిన సీనియర్ నేత తోట త్రిమూర్తులు కూడా టీడీపీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఈ నెల18న ఆయన వైసీపీలో చేరనున్నారు.
తూర్పు, కడపల్లో పార్టీ ఖాళీయేనా

అయితే.. త్రిమూర్తులు బాబుపై తీవ్ర‌స్థాయిలో ఆరోప‌ణ‌లు గుప్పించారు. కాపు నేత‌ల‌ను చంద్ర‌బాబు ఏమాత్ర‌మూ ప‌ట్టించుకోలేద‌ని ఆయ‌న విమ‌ర్శ‌లు చేశారు. అంతేగాకుండా.. కావాల‌ని ప‌లువురు స‌న్నిహితుల‌ను బీజేపీలోకి పంపించారంటూ ఆయ‌న బాంబు పేల్చారు. అయితే… పార్టీని వీడుతున్న‌వారిలో త్రిమూర్తులుతో పాటు మ‌రికొంద‌రు కీల‌క నాయ‌కులు ఉన్న‌ట్లు తెలుస్తోంది.ఏకంగా ఎన్నిక‌లు ముగిసిన కొద్దిరోజుల‌కే టీడీపీకి చెందిన న‌లుగురు రాజ్య‌స‌భ్యులు బీజేపీలో చేర‌డంతో మొద‌లైన వ‌ల‌స‌లు ఇంకా కొన‌సాగుతూనే ఉన్నాయి. ఈ వ‌ల‌స‌ల‌ను ఎలా ఆపాలో తెలియ‌క బాబుగారు ఆగ‌మాగం అవుతున్న‌ట్లు తెలుగు త‌మ్ముళ్లు గుస‌గుస‌లాడుకుంటున్నారు. అయితే.. ఇక్క‌డ చిత్ర‌మైన ప‌రిస్థితి ఏమిటంటే.. పోయేవాళ్లు పోతూపోతూ బాబుపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.క‌డ‌ప జిల్లాలోనూ టీడీపీకి కోలుకోలేని దెబ్బ‌లు త‌గులుతున్నాయి. ఇక ఇక్క‌డి నుంచే ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ సొంత జిల్లా కావ‌డంతో టీడీపీ ప‌త్తాలేకుండా పోవ‌డం ఖాయంగానే క‌నిపిస్తోంది. ఈ జిల్లాలో తెలుగుత‌మ్ముళ్లు వ‌రుస‌బెట్టి పార్టీని వీడుతున్నారు. రాజ్య‌స‌భ స‌భ్యుడు సీఎం ర‌మేశ్‌తో మొద‌లైన వ‌ల‌స‌లు ఆగ‌డం లేదు. ఆ తర్వాత మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి కూడా టీడీపీని వీడుతున్నట్లు ప్రకటించారు. 2014లో వైసీపీ నుంచి గెలిచిన ఆయ‌న టీడీపీలో చేరి మంత్రి అయిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఆయ‌న బీజేపీలో వెళ్లేందుకు అంతా రెడీ చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. కీలక నేతలు రామసుబ్బారెడ్డి, వీర శివారెడ్డి కూడా టీడీపీకి రాజీనామా చేస్తార‌నే టాక్ వినిపిస్తోంది. అయితే..వీరు మాత్రం వైసీపీలో చేరుతార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.ఇక అదే జిల్లాకు చెందిన మ‌రో టీడీపీ సీనియ‌ర్ నేత బ‌త్యాల చెంగ‌ల్రాయుడు కూడా పార్టీ మార‌తార‌ని అంటున్నారు. టీడీపీ జిల్లా పార్టీ అధ్య‌క్షుడు శ్రీనివాసుల‌రెడ్డి సైతం పార్టీలో ఉండాలా ? వ‌ద్దా ? అన్న డైల‌మాలో ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఇలా తెలుగు త‌మ్ముళ్లు వారివారి అవ‌కాశాలను బ‌ట్టి ఇత‌ర పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. బీజేపీ, వైసీపీలోకి వెళ్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ ప‌రిణామాల‌తో తూర్పుగోదావ‌రి, క‌డ‌ప జిల్లాల్లో టీడీపీ ఇక గ‌ల్లంతు కావ‌డం ఖాయ‌మ‌నే టాక్ వినిపిస్తోందిఅయితే.. బాబుగారికి పెద్ద స‌మ‌స్య ఏమిటంటే.. నేత‌ల‌తోపాటు ద్వితీయ, తృతీయ శ్రేణి నాయ‌కులు కూడా పార్టీనీ వీడుతుండ‌డంతో క్షేత్ర‌స్థాయిలో ఉనికి కూడా లేకుండా పోతోంది. దీని నుంచి చంద్ర‌బాబు ఎలా ?బ‌య‌ట‌ప‌డుతారో చూడాలి