ముందస్తు బతుకమ్మ వేడుకల్లో పాల్గోన్నమహిళలు

జగిత్యాల సెప్టెంబర్26  (way2newstv.com)
రాష్ట్ర వ్యాప్తంగా ముందస్తు బతుకమ్మ సంబరాల భాగంగా  జగిత్యాల పట్టణంలోని బృందావనం  కిట్టి పార్టీ మహిళల ఆధ్వర్యంలో జగిత్యాల పట్టణంలో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈసందర్భంగా తీరొక్క పూలతో బతుకమ్మను అలంకరించారు. ఊయల పాటలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ కోలాటంతో మహిళలు సందడి చేశారు. 
ముందస్తు బతుకమ్మ వేడుకల్లో పాల్గోన్నమహిళలు

స్నేహితులతో కలిసి బతుకమ్మ ఆడటం సంతోషంగా ఉందని మహిళలు అభిప్రాయం వ్యక్తం చేశారు. బతుకమ్మ వేడుకలు తొమ్మిది రోజులపాటు  నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో మహిళలు ఉత్సాహంగా పాల్గొని బతుకమ్మకు తీపి పదార్థాలను పాయనంగా సమర్పించారు. ఈ కార్యక్రమంలో కిట్టి సభ్యులు హరిత ,సౌజన్య, సంధ్య, రాణి, దివ్య, ప్రణీత, స్వాతి,రంజిత, శ్రీలత, మాధవి, చైతన్య, సుమలత, శైలజ, పద్మ, ప్రావీన, అపర్ణ తదితరులు పాల్గొన్నారు.
Previous Post Next Post