రైస్ పుల్లింగ్ తో కిల్లింగ్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రైస్ పుల్లింగ్ తో కిల్లింగ్

హైద్రాబాద్, సెప్టెంబర్ 5   (way2newstv.com)
ఈజీ మనీ కావాలా..? కష్టపడకుండా కోటీశ్వరులు కావాలనుకుంటున్నారా..? అయితే రైస్ పుల్లింగ్ కొనుక్కోండి..? రైస్ పుల్లర్ తోయంత్రం మీ దగ్గర పెట్టుకుంటే ఓవర్ నైట్ కోటీశ్వర్లు అయిపోవచ్చు. ఇలా కొందరు చెప్పిన మాయమాటలు విని ప్రజలు మోసబోతున్నారు. నేను చెబుతుంది వింటే మీకు వింతంగా అనిపిస్తోందా..? ఇది ఎలా అనుకుంటున్నారా..? ఆలోచన వద్దు వాస్తవం తెలుసుకోండి. ఇంకెందుకు ఆలస్యం మీరే చూడండి రైసింగ్ పుల్లింగ్ మోసాల గురించి.రైస్ పుల్లింగ్.. ఇదో రకమైన ఛీటింగ్.. రైస్ పుల్లింగ్ పేరుతో ఎన్నో ముఠాలు జనాలను మోసగించిన తీరు గురించి మీరు గడిచిన పదేళ్లలో ఎన్నో వార్తలు పేపర్లలో చదువుతున్నారు. అయినా అవే మాటలతో ప్రజలను వాళ్లు బురిడి కొట్టిచింది నమ్మి మళ్లీ మళ్లీ మోసపోతున్నారు. పెద్దగా కష్టపడనక్కర్లేదు ఒక బక్రా దొరికితే చాలు. మినిమం లక్ష కొట్టేస్తున్నారు. రాజులకాలం నాటి గిన్నెలు, నానాలు, తవ్వకాల్లో బయటపడ్డాయనేది ఒక ప్రచారం.
రైస్ పుల్లింగ్ తో కిల్లింగ్

రైస్ పుల్లర్‌గా చెప్పి ఈ గిన్నలకు, నాణెలకు మహిమలు ఉన్నాయని ఎదుటి వాళ్లని నమ్మిస్తున్నారు రేస్ పుల్లింగ్ ముఠాలు. అతీంద్రియ శక్తుల పేరిట అమాయక జనాన్ని రైస్ పుల్లింగ్ ముఠా దోచుకుంటుంది. రైస్‌ పుల్లింగ్‌ పేరుతో అమాయకులకు మాయమాటలు చెప్పి వీలైనంతమేరకు దోచేస్తున్నారు. తమ వద్ద మహిమలు ఉన్న అతీంద్రియ శక్తులున్న చెంబు ఉందని, అది ఎవరి వద్ద ఉంటే వారిని సిరులు వెతుక్కుంటూ వస్తాయంటూ ప్రజలని నమ్మించి లక్షల్లో కోట్లల్లో దోచుకుంటున్నారు.జాతకాన్ని మార్చే అపూరపమేన గిన్నే, నాణెం ఇందులోనే ఉందంటారు. చూడాలని ట్రై చేశారా కళ్లుపోతాయని భయపెడతారు. నిజమెంతో ఆలోచించే లోపే ఎదుటివారిని చిత్తు చేస్తారు. ఏదో మొత్తం మసిపూసి మారేడు కాయ చేస్తారు. మాయ లేదు మహత్యం లేదు మాములువి పాత రాగి గిన్నె, కాయిన్ ను చూపెట్టి రైస్ పుల్లింగ్ యంత్రం అంటూ నమ్మిస్తు మోసాలకు పాల్పడుతున్నారు. ఈ రైస్ పుల్లింగ్ కాస్త ఖర్చుపెడితే చాలు అపరకుబేరులు మీరే అన్ని బురిడి కొట్టిస్తారు. బియ్యాన్ని ఆకర్షించే మహిమ కలిగిన అద్భుత యంత్రం ఇంట్లో ఉంటే మహర్దశ పడుతుందనే మూఢ నమ్మకం నిండు కుటుంబాలను బలి తీసుకుంటోంది. తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో డాక్టర్‌ పెన్మెత్స రామకృష్ణంరాజు కుటుంబ ఆత్మహత్యకు రైస్‌ పుల్లర్‌ మోసమే కారణమని పోలీసులు నిర్ధారించారు. రైస్‌ పుల్లర్‌ పేరుతో రూ.5 కోట్లు కాజేసి వైద్యుడి కుటుంబం ఆత్మహత్యకు కారకుడైన కృష్ణా జిల్లా కోడూరుకు చెందిన వరికూటి వెంకట వేణుధరప్రసాద్‌ను అరెస్టు చేశారు. హైదరాబాద్‌లో ఉంటున్న ప్రసాద్‌ మరో ముగ్గురితో కలసి ముఠాగా ఏర్పడి రైస్‌ పుల్లింగ్‌ పేరుతో శ్రీకృష్ణ ఆర్థోపెడిక్‌ అండ్‌ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యుడు రామకృష్ణంరాజు నుంచి రూ.5 కోట్లకుపైగా వసూలు చేశాడు. అప్పుల పాలైన రామకృష్ణంరాజు, భార్య లక్ష్మీదేవి, పెద్ద కుమారుడు డాక్టర్‌ కృష్ణసందీప్‌ నాలుగు రోజుల క్రితం సామూహిక ఆత్మహత్యలకు పాల్పడ్డారు.భారత్ కోసం ఈస్ట్ ఇండియా కంపెనీ అప్పట్లో కొత్తగా కాయిన్స్ సిస్టమ్ ని ప్రవేశపెట్టింది. 1616లో సూర్యగ్రహణం ఏర్పడిదట. అప్పట్లో తయారు చేసిన 16 కాయిన్లకి అద్భుత శక్తులు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. తమ దగ్గర ఉన్నవి అవే కాయిన్స్ అంటూ కనపడిన వారి కల్ల ఈ గ్యాంగ్ లు కథలు చెప్పి నమ్మించి మోసం చేస్తున్నారు. బియ్యపు గింజల్ని ఆకర్షించే లక్షణాలుండే లోహాన్ని రైస్‌ పుల్లర్‌గా పరిగణిస్తారు. అత్యంత అరుదైన, ఖరీదైన ఇరీడియం లోహాన్ని కలిగి వుండే వీటిని చూపించి మోసగిస్తున్నారు. అతీత శక్తుల పేరుతో వీటిని విక్రయించడం భారతీయ శిక్షాస్మృతి 415, 420 ప్రకారం నేరం. తేలికగా డబ్బులు సంపాదించేందుకు కొందరు ముఠాలుగా ఏర్పడి రైస్‌ పుల్లింగ్‌ పేరుతో రేడియేషన్‌ ఆర్టికల్‌ అమ్మకాలతో మోసాలకు పాల్పడుతున్నారు. దీనికి దివ్య శక్తులు ఉంటాయని, ఇది ఇంట్లో ఉంటే మంచి జరుగుతుందని నమ్మించి మోసగిస్తున్నారు. రైస్‌ అంటే బియ్యం... పుల్లింగ్‌ అంటే లాక్కోవడం. సాధారణంగా ఓ వస్తువుకు కొద్ది గంటలపాటు అయస్కాంతాన్ని రాపిడి చేస్తే కొద్దిసేపు ఆకర్షణ గుణాన్ని పొందుతుంది. రైస్‌ పుల్లింగ్‌లో దీన్ని అద్భుత శక్తిగా నమ్మిస్తారు. పురాతన లోహ విగ్రహాలు, పాత్రలు, నాణేలను రైస్‌ పుల్లింగ్‌ ముఠా తమ మోసాలకు ముడి సరుకుగా వాడుతుంది. వీటికి అయస్కాంతాన్ని రుద్దడం ద్వారా బియ్యపు గింజలను ఆకర్షించి ప్రజలను మోసగిస్తున్నారు. పురాతన వస్తువుల పేరుతో రూ.కోట్లు కాజేస్తున్నారు.  అతీంద్రియ శక్తులున్నాయని... పెట్టుబడి పెడితే వందల రెట్ల లాభాలుంటాయని నట్టేట ముంచేస్తున్నారు. రైస్ పుల్లింగ్ పేరిట కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి. కేవలం మూఢ నమ్మకాల ఆధారంగానే వారు సొమ్ము చేసుకుంటున్నారు. ఈ దందాలకు పేర్లు ఏవైనప్పటికీ మోసపోతున్నది మాత్రం అమాయకులే అన్నది వాస్తవం.అంతరిక్షంలో అడుగులు పెడుతున్న మానవాళి... ఎంతో అభివృద్ధి చెంది... విశ్వాన్ని అరచేతిలో పెట్టుకున్న ఈ తరుణంలో జనం ఇప్పటికీ మూఢనమ్మకాలను మాత్రం వీడడం లేదు. బియ్యాన్ని ఇట్టే ఆకర్షించే అక్షయ పాత్ర అంటూ రైస్‌ పుల్లింగ్‌ పేరిట సాగుతున్న దందా గురించి తెలియంది కాదు. కొన్ని వేల మంది ఏజెంట్లుగా వ్యవహరిస్తూ లక్షల మంది అమాయకులను నట్టేట ముంచుతున్నారు.ప్రజల బలహీనతలను ఆయుధంగా మలచుకుని అమాయకులను దోచుకోవడమే వారి లక్ష్యం. అతీంద్రియ శక్తులు... గుప్త నిధుల పేరిట కొంతమంది గ్యాంగును ఏర్పాటు చేసి దర్జాగా దోచేస్తున్నారు. మోసగాళ్లు ఆడుతున్న ఈక్రీడలో అమాయక జనం తమ కష్టార్జితాన్ని అర్పించుకుంటున్నారు. తరచూ ఇలాంటి మోసాలు వెలుగు చూస్తున్నా, వారి బారిన పడుతున్న బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. మోసగాళ్లు విభిన్న తరహాలో అమాయకులకు గాలం వేస్తూ డబ్బుల కాజేసి చెక్కేస్తున్నారు.నాసా లాంటి పరిశోధన సంస్థల పేర్లను వాడుతూ.. అత్యంత ఖరీదైన పాత్రగా అభివర్ణిస్తారు. లోహం, ఇరిడీయం అనే లోహంతో తయారై.. ఎలాంటి ఆకర్షణ గుణం లేకున్నా బియ్యాన్ని ఇట్టే ఆకర్షించడంతో దానికి అతీంద్రియ శక్తులున్నాయని అమాయకులను నమ్మిస్తారు. ఈ పాత్రలకు అంతర్జాతీయ మార్కెట్‌లో కొన్ని వేల కోట్ల రూపాయల ధర పలుకుతుందని.. దాని రవాణా కోసం పెట్టుబడులు పెట్టాలంటూ మాఫీయాలోని మధ్యవర్తులతో దందా సాగిస్తారు. పాత్ర, చెంబు, నాణేలు, ఇతర లోహ ఆకారంలో ఉండి బియ్యాన్ని ఆకర్షించే శక్తిని ఉంటుందని నమ్మిస్తారు. ఉపగ్రహాలతో దాన్ని పోలుస్తూ అక్కడి నుంచే ఇది కిందికి పడుతుందనీ నమ్మిస్తారు. దాని విలువ కొన్ని వందల, వేల కోట్ల రూపాయలు ఉంటుందని, ప్రభుత్వ అనుమతులు ఉంటాయని పత్రాలు కూడా సృష్టిస్తారు. వారి మాటలను నమ్మిన అమాయక ప్రజలు అకౌంట్లలో డబ్బులను డిపాజిట్‌ చేస్తారు. బడా వ్యాపారులు, గృహిణులు, ఉద్యోగులతో పాటు చాలామంది ప్రముఖులు కూడా ఈ రైస్‌ పుల్లింగ్‌ బాధితులే.బియ్యాన్ని ఆకర్షించే మహిమ కలిగిన అద్భుత యంత్రం ఇంట్లో ఉంటే మహర్దశ పడుతుందనే మూఢ నమ్మకం నిండు కుటుంబాలను బలి తీసుకుంటోంది. తాజాగా తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో డాక్టర్‌ పెన్మెత్స రామకృష్ణంరాజు కుటుంబ ఆత్మహత్యకు రైస్‌ పుల్లర్‌ మోసమే కారణమని పోలీసులు నిర్ధారించారు. రైస్‌ పుల్లర్‌ పేరుతో రూ.5 కోట్లు కాజేసి వైద్యుడి కుటుంబం ఆత్మహత్యకు కారకుడైన కృష్ణా జిల్లా కోడూరుకు చెందిన వరికూటి వెంకట వేణుధరప్రసాద్‌ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. ఇప్పటికీ జనాలకు సోదీ చెప్పి రైస్ పుల్లింగ్ యంత్రం అంటగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. నిజంగానే ఒక రాగిపాత్ర.. నాలుగు బియ్యపు గింజలు.. అద్భుతాలు సృష్టిస్తాయా..? ఒక రాగిపాత్ర నాలుగు బియ్యపు గింజలు మిమ్మల్ని ఓవర్ నైట్ కోటీశ్వరుల్ని చేస్తాయా..? ఇవి మీ దగ్గర ఉంటే ఏం ఒరుగుతోంది..? లేకపోతే ఏం జరుగుతోంది..? ఛాన్స్ మీ ఉందే ఉంది ఇక చాయిస్ మీదే..? నిజంగానే ఇది రైస్ పుల్లింగా లేక మనీ పుల్లింగా అన్న ఆలోచన వద్దు.. ఇందులో అస్సలు డవుట్ అక్కర్లేదు ఇది రైసు పుల్లింగ్ ఏం కాదు. మొత్తం ఫ్రాడ్. ఇప్పటికైనా మేల్కోండి.