దూసుకెళ్లుతున్న లావు శ్రీకృష్ణ‌దేవ‌రాయ‌లు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

దూసుకెళ్లుతున్న లావు శ్రీకృష్ణ‌దేవ‌రాయ‌లు

గుంటూరు, సెప్టెంబర్ 13, (way2newstv.com)
గుంటూరు జిల్లా న‌ర‌స‌రావుపేట పార్ల‌మెంటు స్థానం నుంచి విజ‌యం సాధించిన వైసీపీ నాయ‌కుడు, యువకుడు, విజ్ఞాన్ విద్యా సంస్థ‌ల అధినేత లావు ర‌త్త‌య్య వార‌సుడు లావు శ్రీకృష్ణ‌దేవ‌రాయ‌లు…పార్టీ అధినేత జ‌గ‌న్ అడుగుజాడ‌ల్లో అభివృద్ధి మంత్రం ప‌ఠిస్తున్నారు. సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు, ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల ప‌రిష్కారం దిశ‌గా లావు శ్రీకృష్ణ‌దేవ‌రాయ‌లు దూసుకుపోతున్నారు. ఎన్నిక‌ల‌కురెండు సంవ‌త్స‌రాల ముందే వైసీపీ తీర్థం పుచ్చుకున్న లావు శ్రీకృష్ణ‌దేవ‌రాయ‌లు అధినేత మాటే వేద‌వాక్కుగా ముందుకు సాగారు. తొలుత‌ గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేయాల‌ని భావించారు.అయితే, ఇక్క‌డ మ‌రో నాయ‌కుడిని నిలిపే అవ‌కాశం ఉండ‌డంతో జ‌గ‌న్ ఆయ‌న‌ను న‌ర‌స‌రావుపేట‌కు పంపారు.
దూసుకెళ్లుతున్న లావు శ్రీకృష్ణ‌దేవ‌రాయ‌లు

నియోజ‌క‌వ‌ర్గం మార్పు చేసినా.. ఎలాంటి సంకోచం లేకుండా వెను వెంట‌నే మార్పుచేసుకుని.. ప్ర‌జ‌ల అభి మానం పొందేలా కార్య‌క్ర‌మాలు రూపొందించుకుని ముందుకు సాగారు. పేట నియోజ‌క‌వ‌ర్గంలో మొత్తం 7 అసెంబ్లీ స్థానాలు ఉండ‌గా.. వీటిలో టీడీపీకి మంచి ప‌ట్టున్న గుర‌జాల‌,వినుకొండ, చిల‌క‌లూరిపేట‌ వంటి నియోజ‌క‌వ ర్గాల్లోనూ త‌న స‌త్తా చాటారు. పార్టీలో నేత‌ల‌ను క‌లుపుకొని పోయే నాయ‌కుడిగా పేరు తెచ్చుకున్నారు. పోల్ మేనేజ్ మెంట్‌ను కూడా పూర్తిగా త‌నభుజాల‌కే ఎత్తుకున్న లావు శ్రీకృష్ణ‌దేవ‌రాయ‌లు అంద‌రినీ త‌న‌వెంట నిలుపుకొని ప్ర‌తిప‌క్ష పార్టీకి చుక్క‌లు చూపించారు. ఈ క్ర‌మంలోనే రాజ‌కీయ దురంధ‌రుడు, సీనియ‌ర్ నేత రాయ‌పాటిసాంబ‌శివ‌రావును సైతం లావు శ్రీకృష్ణ‌దేవ‌రాయ‌లు ఓడించారు. లావు శ్రీకృష్ణ‌దేవ‌రాయ‌లు 1.30 ల‌క్ష‌ల ఓట్ల‌తో ఘ‌న‌విజ‌యం సాధించి పార్ల‌మెంటులో అడుగు పెట్టారు.అంతేకాదు, తానుగెల‌వ‌డంతోపాటు మొత్తం ఏడు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ వైసీపీ నాయ‌కుల గెలుపులో త‌న వంతు కృషి చేశారు. ఇక‌, ఎన్నిక‌ల అనంత‌రం.. కొత్త అనే బిడియం కూడా పోకుండా కేంద్రంలోని మంత్రుల‌ను,అధికారులను క‌లుపుకొని పోయారు. అభివృద్ధిపై దృష్టి పెట్టారు. రైల్వే స‌మ‌స్య‌లు, సాగునీరు, రైతుల‌కు గోడౌన్ల ఏర్పాటు వంటి కేంద్రం నుంచి జ‌ర‌గ‌వ‌ల‌సిన ప‌నుల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని సాల్వ్చేస్తున్నారు. అదే స‌మ‌యంలో నియోజ‌క‌వ‌ర్గంలో అప్ప‌టి క‌ప్పుడు చేయ‌గ‌లిగే ప‌నుల‌ను కూడా వెంట‌నే పూర్తి చేసేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. నిరుద్యోగ యువ‌త‌లో భ‌రోసా క‌ల్పిస్తూ.. ఉన్న‌తచ‌దువులు చ‌దివిన వారికి జాబ్ మేళాలు నిర్వ‌హించే ఏర్పాట్లు చేస్తున్నారు.ఇక‌, జ‌గ‌న్ ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న ప్ర‌త్యేక హోదా విష‌యంపై కేంద్రంతో సంప్ర‌దింపులు జ‌రిపే బాధ్య‌త‌ను కూడా లావు శ్రీకృష్ణ‌దేవ‌రాయ‌లు తీసుకోవ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌భుత్వం త‌ర‌ఫున జ‌రిగే ఉత్త‌ర ప్ర‌త్యుత్త‌రాల‌ను లావు శ్రీకృష్ణ‌దేవ‌రాయ‌లు చూస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే.. వైసీపీ ఎంపీల్లో యువ‌కులు ఎక్కువ..వారు కేంద్రంతో ఏం సంప్ర‌దింపులు జ‌రుపుతారు? అనే సందేహాల‌ను ప‌ఠాపంచ‌లు చేస్తూ లావు శ్రీకృష్ణ‌దేవ‌రాయ‌లు ముందుకు సాగుతున్నారు. ఉద్దండ పిండులైన రాజ‌కీయ నేత‌లు రాజ్య‌మేలిన గుంటూరు జిల్లాలో నెమ్మ‌దిగా స్టార్ట్ అయిన లావు పొలిటిక‌ల్ అడుగులు భ‌విష్య‌త్తులో ఎలా ? ఉంటాయో ? లావు శ్రీకృష్ణ‌దేవ‌రాయ‌లు ఏ రేంజ్ రాజ‌కీయ నేత‌గా ఎదుగుతారో ? చూడాలి.