కనీసం జ్ఞానం లేకుండా చంద్రబాబు మాట్లాడుతున్నారు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కనీసం జ్ఞానం లేకుండా చంద్రబాబు మాట్లాడుతున్నారు

తాడేపల్లి సెప్టెంబర్ 21, (way2newstv.com)
పోలవరం ప్రాజెక్టులో చంద్రబాబు అవినీతి బట్టబయలు అయింది. పోలవరం పనుల రివర్స్ టెండరింగ్ లో అక్రమాలు నిర్ధారణ అయింది. రివర్స్ టెండరింగ్ తో ప్రభుత్వానికి 50 కోట్ల ఆదా అయిందనిఇరిగేషన్ శాఖమంత్రి  అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. శనివారం అయన మీడియాతో మాట్లాడారు. మంత్రి మాట్లాడుతూ కేవలం 300 కోట్ల టెండర్లలో 50 కోట్లు మిగిల్చాం. రివర్స్ టెండరింగ్ పైతెలుగుదేశం పార్టీ అసత్యప్రచారం చేస్తోంది. రివర్స్ టెండరింగ్ పారదర్శకంగా నిర్వహించాం. చంద్రబాబు గతంలో 4.77 శాతం ఎక్కువకు టెండర్ ఇచ్చారు. అదే సంస్ద(మ్యాక్స్ ఇన్ ఫ్రా) ఈరోజు 15.6శాతం లెస్ కు టెండర్ వేసిందని అన్నారు. గత ప్రభుత్వం చేపట్టిన ప్రతిపనికి రివర్స్ టెండరింగ్ కు వెళ్తాం.
కనీసం జ్ఞానం లేకుండా చంద్రబాబు మాట్లాడుతున్నారు

దేశంలో ఓ విజన్ ఉన్న ముఖ్యమంత్రి  వైయస్ జగన్. ఎక్కడైనా టెండర్ లెస్ కు వేయించిఅనుకూలమైనవారికి కట్టబెడతారా అని ప్రశ్నించారు. చంద్రబాబు పధ్దతులు మార్చుకోవాలి.అసత్యప్రచారాలు మానుకోవాలి. చంద్రబాబుకు, అయన అనుకూలమైన మీడియాకు చెబుతున్నాంఅసత్యప్రచారాలు మానుకోవాలని. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు కనీస జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు.అదేమంటే 40 ఏళ్ల ఇండస్ట్రీ అంటారని అన్నారు. రివర్స్ టెండరింగ్లో నవయుగకూడా పాల్గొనవచ్చు.దానిని మేం బ్యాన్ చేయలేదే.అర్హత ఉన్న సంస్దలన్నీ కూడా పాల్గొనవచ్చు. చంద్రబాబుకు సంబంధించిన సంస్దలు కూడా పాల్గొనవచ్చని చెబుతున్నా. పోలవరంపనులు ఆగిపోయాయని దుష్ప్రచారం చేస్తున్నారు. భారీవర ద వస్తుంటే పనులు చేయడం సాధ్యమేనా అని అడిగారు. రివర్స్ టెండరింగ్ అంటే చంద్రబాబుకు భయంఎందుకు. స్పిల్ వే కాఫర్ డ్యాంమినహా ఏం కట్టారు. ప్రాజెక్ట్ విలువ 55 వేల కోట్లు ఇంకా 32 వేల కోట్ల పనులు చేయాల్సింది ఉంది. వాస్తవం ఇలా ఉంటే 70 శాతం పని పూర్తయిందని ఎలా చెబుతారు. ఇప్పటికి అయిన 40 శాతంపనులు అయ్యాయి.అవి కూడా వైయస్ హయాంలో అయిన పనులతో కలుపుకుని. చంద్రబాబు హయాంలో ప్రతి పనికి నాలుగు శాతం అధికమేని విమర్శించారు. టెండర్లు ఎవరికి వస్తాయోచంద్రబాబు చెబుతున్నారు ఆయనఏమైనా కలగన్నారా? మీరు దోపిడీ చేయబోయారా మేం మీ దోపిడీని అడ్డుకుని ప్రజాధనాన్ని ఆదా చేస్తున్నాం. మీ హయాంలో ఒక్క ఉద్యోగం కూడాఇవ్వలేదు.లక్షా 25 వేల ఉద్యోగాలు ఇస్తే దానిపై కూడా చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. డ్యామ్ లన్నీ నిండుతున్నాయి పోలాలన్నీ పచ్చగా కనబడుతున్నాయి. నీ చిల్లర,దోపిడీరాజకీయాలవల్ల ప్రజలు 23 సీట్లు ఇచ్చారు పద్దతి మార్చుకోకపోతే 13 అవుతాయో,10 అవుతాయో అని వ్యాఖ్యానించారు.