మాజీ మంత్రి డికె అరుణ నేతృత్వంలో డిల్లీ పయనం
నిధులు, చెక్ పవర్ తోపాటు పలు సమస్యలపై వినతి పత్రం
నవంబరులో జరిగే సదస్సుకు హజరు కావాలని ఆహ్వానం
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25 (way2newstv.com)
తెలంగాణ సర్పంచుల ఫోరం కేంద్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేందర్ సింగ్ తోమర్ ను కలసుకొంది. మాజీమంత్రి మంత్రి, బిజెపి నాయకురాలు డికె అరుణ నేతృత్వంలో వీరు కేంద్రమంత్రిని ఆయన కార్యాలయంలో కలసుకొని తమ సమస్యలను వివరించి వినతిపత్రం అందజేశారు.కేంద్రం నిధులు నేరుగా గ్రామ పంచాయితీ ఖాతాలోకి రావాలి. రాష్ట్ర ప్రభుత్వం సర్పంచులను అగౌరపరిచేల వ్యవహరిస్తున్నది. చెక్ పవర్ సర్పంచులకు మాత్రమే కేటాయించాలి. 14వ ఆర్థిక సంఘమునిధులను గ్రామాలకు కేటాయించడం లేదు.
కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రితో సర్పంచుల ఫోరం భేటీ
పంచాయితీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తున్నదని వారు పేర్కోన్నారు. గడిచిన ఐదేళ్లలో ఒక్క రూపాయి కూడా గ్రామాలకు కేటాయించలేదు. ఉప సర్పంచ్ కి చెక్ పవర్ తో కొత్త సమస్యలు... ఇది కాస్త గ్రామాల్లో గొడవలకు దారితీస్తున్నాయి. ఏమైనా పనులు చేయాలంటే ఉప సర్పంచులు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిదంగా ఉమ్మడి చెక్ పవర్ ఇవ్వడం దారుణమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరితో సర్పంచులు తీవ్ర మనస్తాపంతో ఉన్నారు. నిధులు లేక గ్రామాలన్ని అభివృద్ధి దూరం... 14 వేల గ్రామాలుఅంధకారంలో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ నిధులను రాష్ట్ర ప్రభుత్వం నిరుగార్చుతున్నది. సీఎం పై మాకు నమ్మకం లేదు...మాటలు తప్ప చేతలు లేవని వారు వినతి పత్రంలో పేర్కోన్నారు. వీటితోపాటు పలు సమస్యలు మంత్రి ముందు ఉంచుతూ నవంబరులో జరిగే సర్పంచుల సదస్సుకు కేంద్ర మంత్రిని ఆహ్వానించారు. వీరి విజ్ఞప్తిపై స్పందిస్తూ త్వరలో తెలంగాణలో పర్యటిస్థానని ఆయనహామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో లో మాజీమంత్రి డికె అరుణ తోపాటు, మాజీ శాసన సభ్యులు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, పార్టీ జాతీయ దళిత మోర్చా కార్యదర్శి బంగారు శృతి, తెలంగాణ విమోచన కమిటీ చైర్మన్ శ్రీవర్ధన్ రెడ్డి, తెలంగాణ సర్పంచుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు భూమన్న యాదవ్, ప్రధాన కార్యదర్శి పాలకొండ ప్రనీల్ చందర్, మహిళా విభాగం అధ్యక్షురాలు జులురు ధనలక్ష్మి, నాయకులు నత్తిమల్లేష్, ఫణి శశాంక్, బీర్ల శంకర్, యాదయ్య యాదవ్, జంగా రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ రామ్ రెడ్డి చంద్ర శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Tags:
all india news