టి-సాట్ ఆవరణలో మొక్కలు నాటిన ఛీఫ్ సెక్రటరీ ఎస్.కె.జోషీ

హైదరాబాద్ సెప్టెంబర్ 26, (way2newstv.com)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, టి-సాట్ గవర్నింగ్ కౌన్సిల్ ఛైర్మన్  ఎస్.కె.జోషీ గురువారం హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని టి-సాట్ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు.టి-సాట్ జనరల్ బాడీ సమావేశానికి హాజరైన జోషీ తొలుత టి-సాట్ సీఈవో కార్యాలయంలో సీఈవో ఆర్.శైలేష్ రెడ్డితో టి-సాట్ నిర్వహణ గురించి వివరాలు తెలుసుకున్నారు. 
టి-సాట్ ఆవరణలో మొక్కలు నాటిన ఛీఫ్ సెక్రటరీ ఎస్.కె.జోషీ

అనంతరం కార్యాలయ ఆవరణలో ఐటి శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్ తో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జోషీ మాట్లాడుతూ టి-సాట్ భవనం చుట్టూ ఆహ్లాదకర వాతావరంఉందని అందుకు అనుగుణంగా విరివిగా చెట్లు పెంచాలని సూచించారు.నాటిన మొక్కలు పెరిగి పెద్దవయ్యే వరకు సంరక్షించాలని, అప్పుడే ఫలితాలు వస్తాయన్నారు.సీఎస్ వెంట డిజిటల్మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్ తో పాటు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.మొక్కలు నాటే కార్యక్రమం ముగిసాక జోషీ జనరల్ బాడీ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం టి-సాట్కార్యాలయ ఆవరణలో ఉన్న వి.హబ్ లో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు.
Previous Post Next Post