తెలంగాణపై ఆర్ధిక మాంద్య ప్రభావం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

తెలంగాణపై ఆర్ధిక మాంద్య ప్రభావం

ఆయుష్మాన్‌ భారత్‌ కన్నా... ఆరోగ్యశ్రీ చాలా మేలు: కేసీఆర్‌
హైద్రాబాద్, సెప్టెంబర్ 9 (way2newstv.com)
తెలంగాణ ప్రభుత్వం 2019-20 సంవత్సరానికి గాను పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెడుతోంది. శాసనసభలో సీఎం కేసీఆర్, శాసనమండలిలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు బడ్జెట్‌ప్రవేశపెట్టి ప్రసంగం ప్రారంభించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం గత ఫిబ్రవరిలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. తాజాగా పూర్తి స్థాయి బడ్జెట్ప్రవేశపెడుతుండటంతో.. ఏయే రంగాలకు ఎలాంటి తాయిలాలు ప్రకటిస్తారనే ఆసక్తి నెలకొంది.ఆదివారం మంత్రివర్గ విస్తరణ అనంతరం తెలంగాణ కేబినెట్ ప్రత్యేకంగా సమావేశమై తెలంగాణ బడ్జెట్‌కుఆమోదం తెలిపింది.ఏడాదిన్నరగా దేశంలో ఆర్థికమాంద్యం ఏర్పడిందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. దిగజారిన ఆర్థిక పరిస్థితికి ఇది నిలువెత్తు నిదర్శనమని చెప్పారు. తెలంగాణ శాసనసభలో బడ్జెట్ప్రసంగాన్ని చదువుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 
తెలంగాణపై ఆర్ధిక మాంద్య ప్రభావం

జీడీపీ వృద్ధి రేటు గణనీయంగా పడిపోయిందని చెప్పారు. వాహనాలు కొనేవారు లేక ఆటోమొబైల్ రంగం కుదేలైపోయిందని అన్నారు. ఇలాంటిపరిస్థితి ఎందుకు తలెత్తిందో అందరూ అర్థం చేసుకోవాలని కోరారు.దేశంలో స్థూల ఆర్థిక విధానాలను కేంద్ర ప్రభుత్వమే శాసిస్తుందని... కేంద్రం తీసుకొచ్చిన విధానాలను రాష్ట్రాలు అనుసరించడంమినహా మరో గత్యంతరం లేదని కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనికి తెలంగాణ రాష్ట్రం కూడా అతీతం కాదని చెప్పారు. దేశ, రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి సంక్లిష్టంగా మారుతున్న తరుణంలో... 2019-20ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ ప్రవేశపెట్టాల్సిన పరిస్థితి రావడం పట్ల తాను చింతిస్తున్నానని తెలిపారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఎంతో జాగ్రత్తగా బడ్జెట్ ను రూపొందించాల్సి వచ్చిందనిచెప్పారు. ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఆర్థికశాస్త్ర మేధావుల సలహాలతో రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు మేధోమధనం చేసి బడ్జెట్ ను రూపొందించారని తెలిపారు.ఆయుష్మాన్ కంటే ఆరోగ్య శ్రీ బెటర్11శాతం విమాన ప్రయాణికుల సంఖ్య పడిపోయిందని.. రూపాయి మారకం విలువ బాగా పడిపోయిందని తెలంగాణ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగాఆయన మాట్లాడుతూ...తెలంగాణపై కూడా ఆర్థిక సంక్షోభ ప్రభావం ఉందన్నారు. జూన్‌, జులైలో తీసుకున్న జీఎస్టీ పరిహారం.. ఏప్రిల్‌, మే నెలల కంటే నాలుగు రెట్లు ఎక్కువన్నారు. బడ్జెట్‌లో సాగునీటిప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యం ఉంటుందని కేసీఆర్ స్పష్టం చేశారు.కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి... సీతారామ ప్రాజెక్టులు యధాతథంగా కొనసాగుతాయన్నారు. పాలనా సౌలభ్యం కోసం కొత్తజిల్లాలను ఏర్పాటు చేశామన్నారు. వృద్ధాప్య పెన్షన్‌కు వయస్సును 57కు తగ్గించామన్నారు. ప్రజలకు మేలు చేసే కేంద్ర పథకాలనే రాష్ట్రంలో అమలు చేస్తున్నామన్నారు. ఆయుష్మాన్‌ భారత్‌కన్నా... ఆరోగ్యశ్రీ చాలా మేలు అన్నారు. పేదలకు ఆరోగ్య భద్రత కల్పించడమే తమ లక్ష్యమని కేసీఆర్ స్పష్టం చేశారు. ఆరోగ్యశ్రీకి రూ.1,336కోట్లు కేటాయించామని.. అన్ని శాఖల్లో బకాయిలచెల్లింపులకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కేసీఆర్ వెల్లడించారు.కేసీఆర్ బడ్జెట్ ప్రసంగం - ముఖ్యాంశాలు
* అసెంబ్లీ లాంజ్‌లోని కాళోజీ చిత్రపటానికి స్పీకర్‌ పోచారం, సీఎం కేసీఆర్‌ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి.
* సీఎం కేసీఆర్ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టి ప్రసంగం ప్రారంభించారు.
* తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో నవంబర్‌ వన్‌గా నిలిచింది.
* దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందింది.
* ఐదేళ్లలో అద్భుత ప్రగతి సాధించింది.
* రూ.1,46,492.3 కోట్లతో తెలంగాణ బడ్జెట్.
* రెవెన్యూ వ్యయం రూ.1,11,055 కోట్లు, మూలధన వ్యయం రూ.17,274.67 కోట్లు.
* 6.3 శాతం అదనపు వృద్ధి రేటు సాధించాం.
* వ్యవసాయ రంగంలో 2018-19 నాటికి 8.1 శాతం వృద్ధిరేటు సాధించాం.
కేటాయింపులు ఇలా..
* రైతుబంధు పథకానికి రూ.12 వేల కోట్లు.
* పంట రుణాల మాఫీకి రూ.6 వేల కోట్లు.
* ఆర్థిక మాంద్యం నేపథ్యంలో దేశవ్యాప్తంగా విపత్కర పరిస్థితులు నెలకొన్నా.. రైతుల శ్రేయస్సు దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాలను కొనసాగిస్తోంది.
* గ్రామ పంచాయతీలకు రూ. 2,714 కోట్లు కేటాయింపు.
* పురపాలక సంఘాలకు రూ.1,764 కోట్లు.
* ఆరోగ్యశ్రీకి ఏడాదికి రూ.1,336 కోట్లు.
* రైతుబీమా ప్రీమియం చెల్లింపునకు రూ.1,137 కోట్లు.
* ఆసరా పింఛన్ల కోసం రూ.9,402 కోట్లు.
* దేశంలోని అన్ని రంగాలపై ఆర్థిక మాంద్యం ప్రభావం చూపుతోంది. దేశంలోని పలు రాష్ట్రాలు తిరోగమనం దిశగా ఉన్న వేళ.. తెలంగాణ అదనపు వృద్ధి రేటు సాధించడం విశేషం.
* ఐటీ రంగంలో 2018-19 నాటికి 11.05 శాతం వృద్ధి రేటు సాధించాం.
* 2018-19 నాటికి రూ. లక్షా 10 వేల కోట్ల ఐటీ ఎగుమతులు.
* మిషన్ కాకతీయ ద్వారా వేలాది చెరువులను పునరుద్ధరించాం.
* వందలాది గురుకులాల్లో లక్షలాది మంది విద్యార్థులకు కార్పొరేట్ విద్య అందుతోంది.
* పోలీసు కమిషనరేట్ల సంఖ్యను 9కి పెంచాం.
* పోలీసు సబ్ డివిజన్ల సంఖ్యను 163కు, పోలీసు సర్కిళ్ల సంఖ్యను 717కు పెంచాం.
* పోలీసు స్టేషన్ల సంఖ్యను 814కి పెంచాం.
* తీవ్రమైన ఆర్థిక మాంద్యం వల్ల ప్రభుత్వానికి ఆదాయం బాగా తగ్గింది.
* వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా బడ్జెట్ రూపొందించాం.
* రానున్న రోజుల్లో పరిస్థితి మెరుగుపడి ఆదాయం పెరుగుతుందని భావిస్తున్నాం.
*అన్ని శాఖల్లో ఉన్న బకాయిలను తక్షణమే చెల్లింపులు. బడ్జెట్‌లో తగిన కేటాయింపులు.
* బకాయిలు చెల్లించాకే కొత్త పనులు చేపట్టాలని నిర్ణయం.
* పరిమితులకు లోబడి నిధుల ఖర్చు. ప్రభుత్వ మార్గనిర్దేశాల ప్రకారమే ఖర్చులు.
* నిధుల ఖర్చుపై మంత్రులు, కార్యదర్శులకు ఆర్థిక శాఖ నుంచి స్పష్టమైన సూచనలు.
* రైతులకు ఉచిత విద్యుత్ కోసం ఇప్పటి వరకు రూ.20,925 కోట్లు ప్రభుత్వం చెల్లించింది.
* ఉదయ్ పథకం ద్వారా రుణభారం రూ.9,695 కోట్లు ప్రభుత్వమే భరించింది.
* విద్యుత్ సంస్థలకు సింగరేణి చెల్లించాల్సిన బకాయిలు రూ.5,772 కోట్లు ప్రభుత్వమే చెల్లించింది.
* అభివృద్ధి, సంక్షేమం కోసం గత ఐదేళ్లలో రూ. 5,37,373 కోట్లు ఖర్చు.
* కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు కోసం అందినవి కేవలం రూ.31,802 కోట్లు మాత్రమే.