మరో పదేండ్లు నేనే సీఎంగా ఉంట: కేసీఆర్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మరో పదేండ్లు నేనే సీఎంగా ఉంట: కేసీఆర్

హైదరాబాద్, సెప్టెంబర్ 16, (way2newstv.com);
రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ఇంకా రెండుటర్మ్‌లు అధికారంలోకి వస్తది.. మరో పదేండ్లు నేనే సీఎంగా ఉంట.. అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టంచేశారు. నాకు కొంతమంది మిత్రులు ఉన్నారు. కేసీఆర్ ఆరోగ్యం ఖతం అయిందట కదా.. అమెరికాకు పోతడట కదా అంటూ ఇరవై ఏండ్లుగా ఇదే ప్రచారం చేస్తున్నరు. ఇరవై ఏండ్లయినా కేసీఆర్ చావలేదు అంటూ చమత్కరించారు. బడ్జెట్‌పై అసెంబ్లీలో చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి మారుతాడంటూ వస్తున్న ప్రచారంపై వివరణ ఇచ్చారు. 
మరో పదేండ్లు నేనే సీఎంగా ఉంట: కేసీఆర్

ఇప్పుడు నాకేంకాలే.. దుక్కలాగా ఉన్న. ఇప్పుడు కూడా చెపుతున్నరు..కేసీఆర్ దిగిపోయి కేటీఆర్‌ను చేసేదే పక్కాఅని.. నేనెందుకు చేస్తా అధ్యక్షా.. నాకు అర్ధంకాదు.. నాకు పాణం వాటంలేదా.. నేను చెపుతున్న అధ్యక్షా.. నేను చెప్పినయి అన్ని జరిగినయి.. ఇదికూడా జరుగుతది.. గ్యారంటీగా మంచి పనులు చేస్తున్నాం కాబట్టి.. వందశాతం ప్రజ ల కోసం తిప్పలు పడుతున్నాం.. ఇంకా తిప్ప లు పడుతాం కాబట్టి వందకు వందశాతం టీఆర్‌ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో కనిష్ఠంగా ఈ టర్మ్ కాకుండా మరో రెండుటర్మ్‌లు అధికారంలో ఉంటది. దీన్ని ఎవ్వరూ ఆపలేరు. ఇప్పుడు నాకు 66 ఏండ్లు.. ఇంకో పదేండ్లు చెయ్యనా.. ఈ టర్మ్ నేనే సీఎంగా ఉంటా.. వచ్చే టర్మ్ కూడా నేనే సీఎంగా ఉంటా.. యేడికి పోను.. మీరు ఎన్నిశాపాలు పెట్టినా నేను గట్టిగనే ఉంట. పనిచేస్తనే ఉంట. ప్రజల దీవెన, దేవుని దయ తప్పకుండా ఉంటది అని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. భట్టి విక్రమార్క మాట్లాడుతూ మీరు నిండునూరేళ్లు క్షేమంగా ఉండాలని.. మీ పాలనలో ప్రజలకు మరింత సంక్షేమం, మేలు కలుగాలని కోరుకుంటున్నానని చెప్పడం ముదావహం!