ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దిగ్భ్రాంతి
చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి
సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి
గుంటూరు, సెప్టెంబర్ 16, (way2newstv.com);
ఏపీ మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు మృతి పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కోడెల మృతి పట్ల ఆయన సంతాపం ప్రకటిస్తూ.. కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. అలాగే ఏపీ గవర్నర్ హరిచందన్ కోడెల మృతిపట్ల సంతాపం ప్రకటించారు. స్పీకర్‌గా కోడెల సేవలు ఎప్పటికీ గుర్తుంటాయని గవర్నర్ పేర్కొన్నారు. కోడెల శివప్రసాదరావు (సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని తన ఇంట్లో ఉరేసుకున్నారు. ఇది గమనించిన కుటుంబసభ్యులు హుటాహుటిన బసవతారకం ఆస్సత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు.మాజీ సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతిఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతి వార్త విన్న టీడీపీ అధ్యక్షుడు మాజీ సీఎం చంద్రబాబు ఆయన తనయుడు మాజీ మంత్రి లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
కోడెల మృతి పట్ల నేతల సంతాపం
కోడెల మృతి పట్ల వారు సంతాపం ప్రకటిస్తూ.. కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. కోడెల శివప్రసాద్ గారి మరణవార్తను జీర్ణించుకోలేకపోతున్నాను. వైద్యవృత్తి నుంచి తెదేపాలో చేరి అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడిగా ఎదిగారు. ఆయన మృతి పార్టీకి ప్రజలకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. అని చంద్రబాబు ట్వీట్ చేశారు.సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌మృతి పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు. కోడెల మృతిపట్ల స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకుశాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. కాసేపటి క్రితం మాజీ మంత్రి కడియం శ్రీహరి బసవతారకం ఆస్పత్రికి చేరుకున్నారు. కడియం కుటుంబ సభ్యులను కడియం పరామర్శించారు.అలాగే గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు, మాజీ మంత్రులు పత్తిపాటి పుల్లారావు, ఆలపాటి రాజా, నక్కా ఆనందబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు అనగాని సత్యప్రసాద్, మద్దాలిగిరి, నేతలు యరపతినేని, దూళిపాళ్ల నరేంద్ర తదితరులు కోడెల మృతి పట్ల సంతాపం ప్రకటించారు.కోడెల శివప్రసాదరావు (సోమవారం మధ్యాహ్నం తన ఇంట్లో ఉరేసుకున్నారు. ఇది గమనించిన కుటుంబసభ్యులు హుటాహుటిన బసవతారకం ఆస్సత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. కాగా.. గత కొన్ని రోజులుగా కోడెలపై కేసులు చుట్టుముట్టడంతో.. రాజకీయ వేధింపులు తట్టుకోలేక ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. కోడెల ఇకలేరన్న విషయం తెలుసుకున్న వీరాభిమానులు టీడీపీ కార్యకర్తలు విషాదంలో మునిగిపోయారు.