అమరావతి సెప్టెంబర్ 5 (way2newstv.com)
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని న తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, హోంమంత్రి మేకతోటి సుచరిత గురువారం కలిసారు. వినాయక చవితి సందర్భంగా తనకు జరిగిన అవమానాన్నిముఖ్యమంత్రి కి ఎమ్మెల్యే శ్రీదేవి తెలిపారు. కులంపేరుతో దూషించారంటూ ఘటన వివరాలను సీఎంకు ఫిర్యాదు చేసారు.
సీఎం ను కలిసిన ఎమ్మెల్యే శ్రీదేవి
సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ మహిళకూ ఇలాంటి పరిస్థితి రాకూడదని అన్నారు. ఏ పార్టీకి చెందిన వారికైనా ఇలాంటి అవమానకర పరిస్థితులు ఎదురుకాకూడదరి అన్నారు. బడుగుబలహీన వర్గాలను కలుపుకుని ముందడుగు వేసే వాతావరణం ఉండాలన్నముఖ్యమంత్రి మహిళల గౌరవానికి భంగం కలిగితే కఠిన చర్యలు తప్పవన్న సంకేతం పోవాలని అన్నారు. సమాజంలో అన్నివర్గాలనూ గౌరవించే పరిస్థితి ఉండాలి. అవసరమైన అన్ని చర్యలూ తీసుకోవాలని హోంమంత్రి సుచరితను ఆదేశించారు.