దీన్ దయాల్ కు నివాళులు

మహబూబ్ నగర్ సెప్టెంబర్ 25   (way2newstv.com)
బుధవారం నాడు బీజేపీ జిల్లా కార్యాలయంలో జనసంఘ్ సిద్ధాంత కర్త  పండిత్ దీన్ దయల్  జయంతి సంధర్బంగా ఆయనకు నివాళ్ళు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పార్టీ జిల్లాఅధ్యక్షులు పద్మజా రెడ్డి, మాజీ ఎమ్మెల్లే ఎర్ర శేఖర్ పాల్గొన్నారు. నేతలు మాట్లాడుతూ ధీనదయల్ గారు నిరుపేద కుటుంబంలో జన్మించి తాను నమ్ముకున్న సిద్దాంతాలకు కట్టుబడి సంఘ్సిద్దాంతకర్తగా, పార్టీ అవిర్భవకునిగా ఎదిగారని అన్నారు.  
దీన్ దయాల్ కు నివాళులు

ఏకాత్మ మానవతా వాదం అనే నినాదంతో దేశం అంతా ఒక్కటే అని ఎలుగెత్తి చెప్పారని, దాదాపుగా 17 సంవత్సరాలు జనసంఘ్ పార్టీప్రధాన కార్యదర్శిగా పనిచేసి ఎంతోమంది నాయకులను తయారు చేసారని అన్నారు.దీన్ దయల్ కు నివాళ్ళు అర్పించిన వారిలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నింగి రెడ్డి, పడాకుల బాలరాజు, మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు అంజమ్మ, జిల్లా ఉపాధ్యక్షులు పడాకుల సత్యం,వీరబ్రహ్మచారి, జిల్లా ప్రధాన కార్యదర్శి పి. శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కోశాధికారి కృష్ణావర్ధన్ రెడ్డి, నాయకులు పడాకుల రామచంద్రయ్య, అంజయ్య, రామేశ్వరీ, జయశ్రీ, పోతుల రాజేందర్ రెడ్డి, ప్రవీణ్,సురేందర్ రెడ్డి, సత్యం, లక్ష్మీదేవి, మహేష్, సుధాకర్, సరోజ, వెంకటేష్, మఠం మయూర్ నాథ్, సుదీర్ రెడ్డీ, దర్పల్లి హరి, ప్రశాంత్, రాజు,అఖిల్ తదితరులు పాల్గొన్నారు.
Previous Post Next Post