దుమారం రేపుతున్న తలసాని వ్యాఖ్యలు

హైదరాబాద్ సెప్టెంబర్ 7  (way2newstv.com)
మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయవర్గాల్లో హట్‌టాపిక్‌గా మారుతున్నాయి. సిద్దిపేటలో యూరియా కోసం క్యూ లైన్‌లో నిలబడి రైతు చనిపోయిన ఘటనపై మంత్రి నిరంజన్‌రెడ్డి వ్యాఖ్యలు మరిచిపోకముందే తలసాని కూడా అలాంటి వ్యాఖ్యలే చేశారు. 
 దుమారం రేపుతున్న తలసాని వ్యాఖ్యలు

గాంధీ ఆసుపత్రిలో వార్డులను పరిశీలించిన తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. హైదరాబాద్‌ను విష జ్వరాలు బెంబేలెత్తిస్తున్నాయి. అయితే జ్వరాలు రాకముందే ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు? ఎందుకు చర్యలు తీసుకోలేదని మీడియా ప్రశ్నించింది. దీంతో తలసాని సహనం కోల్పోయారు. బిడ్డ పుట్టక ముందే అన్ని చేస్తామా అంటూ వెటకారంగా సమాధానమిచ్చారు. తలసాని వ్యాఖ్యలపై ఇప్పడు జనాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది.
Previous Post Next Post