ఐదేళ్లలో రాష్ట్ర సంపద రెట్టింపు అయింది - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఐదేళ్లలో రాష్ట్ర సంపద రెట్టింపు అయింది

బడ్జెట్ ప్రసంగంలో ముఖ్యమంత్రి  కేసీఆర్
హైదరాబాద్ సెప్టెంబర్ 9 (way2newstv.com)
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సీఎం కేసీఆర్ అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ అద్భుత ప్రగతినిసాధిస్తోందన్నారు. గడచిన ఐదేళ్లలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు... యావత్ దేశాన్ని ఆశ్చర్యపరిచాయని కేసీఆర్ పేర్కొన్నారు. దేశంలోనే నంబర్వన్ రాష్ట్రంగా తెలంగాణ సగర్వంగా నిలిచిందనికొనియాడారు. తెలంగాణ ఏర్పాటుకు రెండేళ్లకు ముందు 4.2శాతం ఉన్న జీఎస్డీపీ.. 2018-19లో జీఎస్డీపీ 10.5శాతానికి పెరిగిందన్నారు.ఐదేళ్లలో రాష్ట్ర సంపద రెట్టింపు అయిందని కేసీఆర్ స్పష్టం చేశారు. మూలధన వ్యయంలో దేశంలో అగ్రగామిగా ఉందన్నారు. నిధుల ఖర్చులో సమైక్య రాష్ట్రంలో తెలంగాణ వాటా తక్కువగాఉండేదన్నారు. 
ఐదేళ్లలో రాష్ట్ర సంపద రెట్టింపు అయింది

16.3శాతం మూలధనం వ్యయంతో తెలంగాణ అగ్రస్థానాన్ని ఆక్రమించిందని కేసీఆర్ స్పష్టం చేశారు. మూలధనం వ్యవయంలో కేంద్రానిది కేవలం 12.8 శాతం అని.. గత ఐదేళ్లలోమూలధనం కింద రూ.1,65, 167 కోట్లు ఖర్చు చేశామన్నారు. తెలంగాణలో సగటు ఆదాయ వృద్ధి రేటు 21.49 శాతం అని.. సమర్ధవంతమైన ఆర్థిక నిర్వహణతో అద్భుతాలు వస్తాయని కేసీఆర్ స్పష్టంచేశారు. నాణ్యమైన విద్యుత్ 24 గంటల పాటు ఇవ్వడంతో... పారిశ్రామిక, వ్యవసాయరంగం పునరుత్తేజం సాధించాయని తెలిపారు. రైతుబంధు పథకం వ్యవసాయరంగానికి తోడ్పాటునందించిందనికేసీఆర్ పేర్కొన్నారు.తెలంగాణలో సుస్థిర ఆర్థికాభివృద్ధి సాధించామన్నారు. వ్యవసాయరంగంలో 8.1శాతం వృద్ధిరేటు సాధించామన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో 1.8 శాతం నుంచి 6.3శాతం వృద్ధి సాధించామనికేసీఆర్ స్పష్టం చేశారు. పారిశ్రామికరంగంలో 5.8 శాతం వృద్ధి రేటు.. సేవలరంగంలో 11.8శాతం వృద్ధిరేటు నమోదైందన్నారు. 2014-15లో ఐటీ ఎగుమతులు రూ.52 వేల కోట్లు అని.. 2018-19 నాటికిరూ.లక్షా 10 వేల కోట్లకు చేరుకున్నాయన్నారు. తెలంగాణలో కనీవినీ ఎరుగుని రీతిలో విద్యుత్ ఉత్పాదన జరిగిందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.