పార్టీ విస్తరణ దిశగా కేసీఆర్ అడుగులు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పార్టీ విస్తరణ దిశగా కేసీఆర్ అడుగులు

హైద్రాబాద్, సెప్టెంబర్ 18, (way2newstv.com)
అధికార టీఆర్‌ఎస్‌ విస్తరణపై కన్నేసిందా ప్రాంతీయపార్టీగా ఉన్న టీఆర్‌ఎస్‌ జాతీయపార్టీ కోసం ప్రయత్నం చేస్తుందా తెలంగాణ స్టేట్‌పై పట్టు సాధించిన గులాబీ అధినేత పక్కరాష్ట్రాల్లో పాగా వేసేందుకు వ్యూహం రచిస్తున్నారా అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. తెలంగాణ సెంటిమెంట్‌తో అధికారంలోకి వచ్చిన అధికారపార్టీ ఇతర రాష్ట్రాల్లో పాగవేసేందుకు పక్క స్కేచ్‌తో అడుగువేస్తున్నట్లు సమాచారం. టీఆర్‌ఎస్‌ అధికార నేత కేసీఆర్‌ జాతీయ పార్టీగా అవతరించడానికి రాజకీయ వ్యూహం రచిస్తున్నట్లు తాజాగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అర్థమవుతోంది.  తెలంగాణలో రెండోసారి అధికారంలోకి వచ్చి దూకుడు మీద ఉన్న టీఆర్‌ఎస్ పార్టీ ఇకపై మహారాష్ట్ర ఎన్నికల్లోనూ పోటీ చేయనున్నట్లు సమాచారం. 
పార్టీ విస్తరణ దిశగా కేసీఆర్ అడుగులు

ఇదేదో ఫెడరల్ ఫ్రంట్ కార్యకలాపాలను ముమ్మరం చేయడానికి గులాబీ దళపతి కేసీఆర్ వేసిన కొత్త ఎత్తుగడ అనుకుంటే పొరపాటే. మహారాష్ట్రకు చెందిన కొంత మంది నేతల విజ్ఞప్తి మేరకు అక్కడ పార్టీ తరఫున పోటీ చేయడానికి కేసీఆర్ సూత్రప్రాయంగా అంగీకరించారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు అద్భుతంగా ఉన్నాయని తెలంగాణ సరిహద్దులో ఉన్న గ్రామాల ప్రజలు కొంతకాలంగా ప్రశంసలు కురిపిస్తున్నారు.పార్టీ ఫిరాయింపులపై ఫిర్యాదు కర్ణాటకలో ఉన్న బళ్లారి, మహారాష్ట్రలో ఉన్న నాందేడ్‌ ప్రాంతాలతో కలిసి నిజాం స్టేట్‌లో తెలంగాణ ఉండేది. తెలంగాణ విమోచన తర్వాత ఈ రెండు ప్రాంతాలు కర్ణాటకలోకి బళ్లారి మహారాష్ట్రలోకి నాందేడ్‌ విడిపోయాయి. తెలంగాణ సరిహద్దులో ఉండే ఈ ప్రాంతాల్లో టీఆర్ఎస్ పార్టీని విస్తరించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా నాందేడ్ జిల్లాకు చెందిన దెగ్లూర్, నాయిగాం, భోకర్, హిమాయత్ నగర్, కిన్ వట్ నియోజక వర్గాల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసేందుకు అనుమతి ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ను కలిశారు. అందుకు సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఇక బళ్లారితో పాటు ఏపీలో కూడా వచ్చే మున్సిపల్‌ ఎన్నికల నాటికి టీఆర్‌ఎస్‌ అక్కడ కూడా బీఫాంలు ఇచ్చి జాతీయపార్టీ గుర్తింపుపై కన్నేసింది. గత కొద్దిరోజులుగా జాతీయపార్టీగా అవతరించడానికి ప్రయత్నం చేస్తుందని ప్రచారం జరుగుతూ వచ్చింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో సైతం చాలా మంది నేతలు టీఆర్‌ఎస్‌ నుంచి పోటి చేయడానికి ఆసక్తి ఉన్నట్లు ప్రచారం జరిగింది. మహారాష్ట్ర ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ బీఫాం ఇస్తే భవిష్యత్తులో ఏపీ, కర్ణాటకలో సైతం టీఆర్‌ఎస్ బిఫాంలు ఇచ్చే అవకాశముంది. మహారాష్ట్ర ప్రజాప్రతినిధుల విజ్ఞప్తిని విన్న కేసీఆర్ దీనిపై త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. టీఆర్‌ఎస్‌ పార్టీ విస్తరణ వ్యూహం ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి మరి.