జడ్చర్ల సెప్టెంబర్ 17, (way2newstv.com)
మహబూబ్ నగర్ జిల్లా బాదేపల్లి మున్సిపాలిటీ పరిధిలోని బిజెపి కార్యాలయంలో ఆవరణలో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను బిజెపి నేత జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ ఎగురవేశారు. తరువాత అయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి సెప్టెంబర్ 17 న స్వాతంత్ర్యం వచ్చిందని ఆయన అన్నారు.
ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై వుందని అన్నారు. విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించే వరకు బిజెపి పోరాటం చెస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు రమోహన్, మధు, సామల నాగరాజు, రేలింగ్ నాగరాజు , వెంకటేష్ గౌడ్, వెంకట్. సలేకుల నర్సింహ., కొమిరి సాహితి, చందు., రమేష్, నర్సింహ, మాచారంచారి పరుశవేదిమురళీ, కృష్ణయ్య, మాచారం శ్రీను, రమేష్, సునిల్ మురళీ, బాలస్వామి, స్వామి.తదితరులు పాల్గొన్నారు.