భయపెడుతున్న వైరల్, డెంగీ ఫీవర్లు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

భయపెడుతున్న వైరల్, డెంగీ ఫీవర్లు

అనంతపురం, సెప్టెంబర్ 18, (way2newstv.com)
వైరల్, డెంగీ జ్వరాలు ప్రబలడంతో హిందూపురం జిల్లా ప్రభుత్వ ప్రభుత్వ ఆస్పత్రి రోగులతో కిటకిటలాడుతోంది. పట్టణశివారులోని మురికివాడల నుంచే కాకుండా పరిసర గ్రామాల నుంచి మలేరియా, టైఫాయిడ్, వైరల్‌ ఫీవర్స్‌ బాధపడుతున్న వారు వందలాదిగా ఆస్పత్రికి తరలివస్తున్నారు. జ్వరపీడితుల్లో చిన్నారులే ఎక్కువగా ఉండడం... డెంగీ లక్షణాలు కనిపిస్తుండడంతో పరిస్థితి విషమిస్తోంది.హిందూపురం ఆస్పత్రిలో 20 మంది వైద్యులుండాలి. కానీ ప్రస్తుతం 12 మందే ఉన్నారు. 8 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక ప్రస్తుతం ఇన్‌పేషెంట్ల సంఖ్య మూడొంతులు పెరగడంతో ఇక్కడి వైద్యులు అందరికీ మెరుగైన వైద్యసేవలందించలేకపోతున్నారు. 
భయపెడుతున్న వైరల్, డెంగీ ఫీవర్లు

మరోవైపు మంచాల కొరత వేధిస్తుండడంతో ఒకే మంచంపై ముగ్గురిని ఉంచి చికిత్సలు చేస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో మరికొందరిని నేలపైనే పడుకోబెట్టి చికిత్సలు చేస్తున్నారు. ఈ ఆస్పత్రిలో కనీస వసతులు లేకపోవడంతో ఆస్పత్రికి వచ్చిన వారంతా నరకం చూస్తున్నారుప్రభుత్వ ఆస్పత్రిలో సరైన వసతులు లేకపోవడం...కనీసం బెడ్లు కూడా అందుబాటులో లేకపోవడంతో జనం అంతా ప్రైవేటు ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. దీంతో హిందూపురం పట్టణంలోని ప్రైవేటు ఆస్పత్రులన్నీ జ్వరపీడితులతో కిటకిటలాడుతున్నాయి. ఏ ఆస్పత్రి వద్ద చూసినా చాంతాడంత క్యూ ఉంటోంది. ఇక చిన్నపిల్లల ఆస్పత్రుల వద్ద రద్దీ చెప్పలేనంతగా ఉంది.  దీంతో గంటల తరబడి వేచి చూస్తే గానీ చిన్నారులకు వైద్యం అందడం లేదు. టోకెన్‌ పేరుతోనే రూ. వందలు వసూలు చేస్తున్న ప్రైవేటు వైద్యులు... చిన్నపాటి జర్వానికే రక్త, మూత్రపరీక్షలు చేయిస్తున్నారు. దీనికి తోడు వేలాది రూపాయల మందులు, టానిక్‌లు రాసిస్తూ ప్రజలు దోచుకుంటున్నారు. దీంతో పేదలు అప్పులు చేసి మరి వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.నీరు కలుషితం కావడం వల్లే వ్యాధులు ప్రబలడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఎటుచూచినా అపరిశుభ్రత...దోమలు, పందుల బెడద ఎక్కువగా ఉండడం కూడా రోగాలు వ్యాప్తికి కారణంగా తెలుస్తోంది. పరిస్థితి ఇంతగా విషమిస్తున్నా కనీసం ఫాగింగ్ కూడా చేపట్టకపోవడంతో జనమంతా దోమకాట్లతో జ్వరాలబారిన పడుతున్నారు.బెజవాడలో పడకేసిన ఆరోగ్యం బెజవాడలో  ప్రజారోగ్యం పడకేసింది. విష జ్వరాలు విజృంభించడంతో ప్రజలు విలవిలాడుతున్నారు. డెంగీ, మలేరియా, టైఫాయిడ్, వైరల్ ఫీవర్ కేసులు రోజుకి పెరిగిపోతున్నాయి. మురికివాడల్లోని పలు ప్రాంతాల్లో అనుమానిత కేసులు నమోదవుతుండటంతో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. సింగ్ నగర్, పాయకాపురం, ప్రకాశ్ నగర్, సుందరయ్య నగర్, నాలా పరిసరాలు, బుడమేరు కట్ట ప్రాంతాల్లో ప్రజలను జ్వరాలు పట్టిపీడిస్తున్నాయి. టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ, వైరల్ ఫీవర్స్ బారిన పడి జనం మంచం పట్టారు.విష జ్వరాలు సోకినవారిలో ప్లేట్ లెట్ కౌంట్ పడిపోతున్నాయి. దీంతో రోగులు స్ధానిక ప్రభుత్వాసుత్రులకు వెళ్లినప్పటికీ అక్కడ సరైన వసతులు లేకపోవడంతో కార్పొరేట్ ఆసుపత్రులను ఆశ్రయించాల్సిన పరిస్ధితి ఏర్పడింది. దీంతో డబ్బులు లేని పేద ప్రజలు అప్పులపాలవుతున్నారు. తమ బాగోగులు పట్టించుకునే వారే కరువయ్యారని రోగులు ఆవేదన చెందుతున్నారు. అపరిశుభ్ర వాతావరణం, కలుషితమైన నీరు సేవించడం వల్లే జ్వరాలు వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. పరిసరాల శుభ్రతతో పాటు నీరు నిల్వవుండకుండా చర్యలు తీసుకుంటే దోమల సంతతిని నిరోధించవచ్చంటున్నారు.