బొప్పి కడుతున్న బొప్పాయి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

బొప్పి కడుతున్న బొప్పాయి

హైద్రాబాద్, సెప్టెంబర్ 26 (way2newstv.com)
మార్కెట్ లో ఏదైనా వస్తువుకు డిమాండ్ వచ్చిందంటే చాలు…. వాటి ధరలు ఆకాశానంటుతాయి. పది రూపాయల వస్తువు వందల్లోకి వెళ్లిపోతుంది. ఈ ధరలపై సర్కార్ నియంత్రణ లేకపోవడంతో ప్రతిసారి సామాన్యుడే బలికావాల్సి వస్తుంది. తాజాగా డెంగీ జ్వరం వీరవిహారం చేస్తుండడంతో ఆ జ్వరాలకు బొప్పాయే నివారణ అని చెబుతున్నారు. మొన్నటి వరకు కిలో 15 రూపాయలు పలికిన బొప్పాయి ధర ప్రస్తుతం వందపైనే పలుకుతోంది. మరోవైపు భారీ వర్షాల కారణంగా ఉల్లి ధరలు సైతం అమాంతం పెరిగిపోయాయి.డెంగీ కారక దోమల ఉధృతితో నగరవాసులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 
బొప్పి కడుతున్న బొప్పాయి

ప్రత్యేకించి ఔషదాలు ఏమీ లేవు. జ్వరాన్ని నియంత్రించడం బొప్పాయి ద్వారా మాత్రమే నని పలువురు వైద్యులు పేర్కొంటున్నారు. బొప్పాయి పండు తినడం ద్వారా, బొప్పాయి ఆకు రసం తాగడం ద్వారా డెంగీ వ్యాధిని నివారించవచ్చని చెబుతున్నారు. ఇప్పటికే చాలా మంది డెంగీ బారిన పడి ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ డెంగీ వ్యాధి కారణంగా మార్కెట్లో బొప్పాయి రేటు భారీగా పెరిగిపోయింది.మరోవైపు దేశవ్యాప్తంగా ఉల్లి ధర కష్టమర్లకు కన్నీళ్లు తెప్పిస్తోంది. ఢిల్లీ మార్కెట్లో అయితే ఏకంగా కేజీ ఉల్లి ధర రూ. 70 నుంచి రూ.80 పలుకుతుంది. హైదరాబాద్ లోని పలు మార్కెట్లలో కేజీ రూ. 50 నుంచి 65 వరకు అమ్ముడు పోతుంది. రెండు వారాలుగా ఈ ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. మహారాష్ట్ర తదితర ఉల్లి ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా రవాణాకు అంతరాయం కలుగుతుండటంతో సరఫరా తగినంతగా లేదు. దీంతో సరుకు రావడం లేదు. ఇదే అదునుగా భావించిన వ్యాపారులు ఉల్లి ధరలను అమాంతం పెంచేశారు. గతంలో ఢిల్లీలో ఎన్నికలు జరిగిన సమయంలో ఉల్లి ధర వంద రూపాయలకు పెరిగిపోవడంతో ప్రభుత్వమే పతనమైంది. అదే మరి ఉల్లిఘాటు