విజిల్‌` ట్రైల‌ర్‌కు అమేజింగ్ రెస్పాన్స్‌.. దీపావ‌ళి సంద‌ర్భంగా తెలుగు, త‌మిళ భాష‌ల్లో అక్టోబ‌ర్ 25న వ‌ర‌ల్డ్‌వైడ్‌ గ్రాండ్ రిలీజ్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

విజిల్‌` ట్రైల‌ర్‌కు అమేజింగ్ రెస్పాన్స్‌.. దీపావ‌ళి సంద‌ర్భంగా తెలుగు, త‌మిళ భాష‌ల్లో అక్టోబ‌ర్ 25న వ‌ర‌ల్డ్‌వైడ్‌ గ్రాండ్ రిలీజ్

త‌మిళ స్టార్ హీరో విజ‌య్ ద్విపాత్రాభిన‌యం చేస్తున్న చిత్రం `విజ‌య్‌`. పోలీస్‌(తెరి), అదిరింది(మెర్స‌ల్‌) వంటి బ్లాక్ బ‌స్టర్ చిత్రాల త‌ర్వాత విజ‌య్ హీరోగా అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఎమోష‌న‌ల్ స్పోర్ట్స్ డ్రామా `బిగిల్‌`. న‌య‌న‌తార హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఏజీయ‌స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై క‌ల్పాతి ఎస్‌.అఘోరాం, కల్పాతి ఎస్‌.గ‌ణేశ్‌, క‌ల్పాతి ఎస్‌.సురేశ్ నిర్మించిన ఈ చిత్రాన్ని `విజిల్‌`గా  ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై మ‌హేశ్ కోనేరు తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నారు. దీపావ‌ళి సంద‌ర్బంగా తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఈ చిత్రం అక్టోబ‌ర్ 25న విడుద‌ల కానుంది. 
విజిల్‌` ట్రైల‌ర్‌కు అమేజింగ్ రెస్పాన్స్‌.. దీపావ‌ళి సంద‌ర్భంగా తెలుగు, త‌మిళ భాష‌ల్లో అక్టోబ‌ర్ 25న వ‌ర‌ల్డ్‌వైడ్‌ గ్రాండ్ రిలీజ్

ఈ సినిమా ట్రైల‌ర్‌ను గురువారం చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.సినిమా లేడీస్ ఫుట్‌బాల్ క్రీడ‌ను ఆధారంగా చేసుకుని డైరెక్ట‌ర్ అట్లీ తెర‌కెక్కించ‌గా రాజ‌ప్ప అనే మాస్ క్యారెక్ట‌ర్‌తో పాటు.. యంగ్ లుక్‌లోని మైకేల్ అనే ఫుట్‌బాల్ కోచ్ పాత్ర‌లో విజ‌య్ న‌ట‌న ఆక‌ట్టుకుంటుంది. న‌య‌న‌తార గ్లామ‌ర్ సినిమాకు ఓ ప్ల‌స్ కానుంది. లేడీస్ ఫుట్‌బాల్ టీమ్‌ను మైకేల్ ఎలా ట్రైన్ చేశాడు. అనే కాన్సెప్ట్‌తో క‌ట్ చేసిన ట్రైల‌ర్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వ‌స్తుంది. ఈ సంద‌ర్భంగా...ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్షన్స్ అధినేత మ‌హేశ్ కొనేరు మాట్లాడుతూ - ``త‌మిళంలోని అగ్ర క‌థానాయ‌కుల్లో విజ‌య్ ఒక‌రు. ఆయ‌న అట్లీ ద‌ర్వ‌క‌త్వంలో ఇది వ‌ర‌కు చేసిన రెండు చిత్రాలు బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాలుగా నిలిచాయి. వీరి క‌ల‌యిక‌లో వ‌చ్చిన హ్యాట్రిక్ చిత్ర‌మిది. భారీ అంచ‌నాలున్నాయి. ఈ సినిమా హ‌క్కుల కోసం ఎంతో మంది పోటీ ప‌డ‌గా ఈస్ట్ కోస్ట్ ప్రొడక్ష‌న్స్ సంస్థ ఫ్యాన్సీ రేటుతో తెలుగు విడుద‌ల హ‌క్కుల‌ను సొంతం చేసుకుంది. దీపావ‌ళి సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 25న సినిమాను విడుద‌ల చేస్తున్నాం. మాకు అవ‌కాశం ఇచ్చిన హీరో విజ‌య్‌గారికి, నిర్మాత‌ల‌కు థ్యాంక్స్‌. మాస్, క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రం అన్నీ వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుంది`` అన్నారు.