నియోజకవర్గాలకు దూరంగా 30 మందికి పైగా ఎమ్మెల్యేలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

నియోజకవర్గాలకు దూరంగా 30 మందికి పైగా ఎమ్మెల్యేలు

ఏలూరు, అక్టోబరు 21, (way2newstv.com)
ఏపీలో అధికార పార్టీ వైసీపీకి భారీ సంఖ్యలో ఎమ్మెల్యేలు వ‌చ్చాయి. 151 స్థానాల్లో ఆ పార్టీ విజ‌యం సాధించింది. జ‌గ‌న్‌ని మిన‌హాయిస్తే.. 150 మంది భారీ సంఖ్యలో వైసీపీకి అందివ‌చ్చారు. మ‌రి వీరు ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేసి ఐదు మాసాలు పూర్తయ్యాయి. ఈ ఐదు మాసాల కాలంలో వీరు ఏం చేశారు. మంత్రుల‌ను మిన‌హాయిస్తే.. దాదాపు 125 మంది ఎమ్మెల్యేలు ప్రజ‌ల్లోనే ఉంటున్నారా ? ప‌్రజ‌ల‌కు చేరువ అవుతున్నారా ? న‌వ‌ర‌త్నాల‌ను ప్రక‌టిస్తున్న జ‌గ‌న్ వ్యూహాన్ని, ప్రభుత్వం పంథాను వారు ప్రజ‌ల‌కు వివ‌రిస్తున్నారా ? ఇప్పుడు తెర‌మీదికి వ‌స్తున్న ప్రశ్నలు ఇవే.ఇప్పటికే జ‌గ‌న్ వ్యాఖ్యల ప్రకారం ప్రభుత్వం అమ‌లు చేస్తున్న ప్రతి కార్యక్రమాన్నీ కూడా ఎమ్మెల్యేలు త‌ప్పకుండా నియోజ‌కవ‌ర్గాల్లో అమ‌లు చేయించాలి. 
 నియోజకవర్గాలకు దూరంగా 30 మందికి పైగా ఎమ్మెల్యేలు

ప్రజ‌ల‌కు-ప్రభుత్వానికి మ‌ధ్య గ్యాప్ లేకుండా చూసుకునే బాధ్యత కూడా వీరికే అప్పగించారు. ఏ అధికారి వ‌ద్దకు వెళ్లినా.. పూర్తిగా స‌హ‌క‌రించేలా కూడా సీఎం స్థాయిలో నిర్ణయాలు జ‌రిగాయి. గ‌తంలో మాదిరిగా సీఎం పేషీని అడిగి కానీ.. స్పందించ‌లేమ‌ని ఏ క‌లెక్టర్ కూడా చెప్పే ప‌రిస్థితి ఇప్పుడు లేదు. పూర్తిగా ఏ క‌లెక్టర‌యినా ఎమ్మెల్యేల‌కు స‌హ‌క‌రించాలి.మ‌రి ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు ? వారి ప‌నితీరు ఎలా ఉంది ? అనే ప్రశ్నలు తెర‌మీదికి వ‌చ్చిన‌ప్పుడు స‌గానికి పైగా ఎమ్మెల్యేలు త‌మ ప‌నుల్లోనే నిమ‌గ్నమ‌య్యార‌నేది నిజం అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎన్నిక‌ల‌కు ముందు ఎన్నిక‌ల్లోనూ వైసీపీ ఎమ్మెల్యేలు చాలా వ‌ర‌కు ఖ‌ర్చు చేశారు. అప్పులు చేసిన‌వారు ఉన్నారు.. సొంత స్థలాల‌ను, పొలాల‌ను అమ్ముకున్నవారు కూడా ఉన్నారు. దీంతో వీరంతా ఆయా అప్పులు తీర్చుకునేందుకు రెడీ అయ్యారనేది ప‌రిశీల‌కుల మాట‌. ఇక‌, స‌గంలో స‌గం మంది అస‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లోనే ఉండ‌డం లేద‌ని అంటున్నారు. అంటే వీరి సంఖ్య 25-30 మధ్య ఉంటుంద‌ని అంటున్నారు.వీరు విదేశాల‌కు రాక‌పోక‌లు సాగిస్తూ.. త‌మ ప‌నుల్లో బిజీగా ఉన్నార‌ని అంటున్నారు. దీంతో నియోజ‌క‌వ‌ర్గాల‌ను ప‌ట్టించుకునే వారు లేర‌లేద‌ని వాస్తవం అంటున్నారు ప‌రిశీల‌కులు. కొంద‌రు గ‌త యేడాదిన్నర కాలంగా అల‌సిపోయాం.. అంటూ హైద‌రాబాద్‌లోనే మ‌కాం వేసి అక్కడ రిలాక్స్ అవుతున్నారు. ఇక‌, ఇప్పుడు జ‌గ‌న్ తీసుకున్న నిర్ణయం మేర‌కు నియోజ‌క‌వ‌ర్గానికి కోటి రూపాయ‌ల‌ను కేటాయించ‌నున్నారు. మ‌రి ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో ప‌రిశీలించిస‌మ‌స్యలు తెలుసుకోక‌పోతే.. ఆ నిధులు వినియోగం అయ్యేది ఎలా? ఇప్పటికైనా కొంద‌రు ఎమ్మెల్యేలు చేస్తున్న చ‌ర్యల కార‌ణంగా ప్రభుత్వానికి ఇబ్బంది రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వీరిపై ఉంద‌ని సూచిస్తున్నారు. ఎమ్మెల్యేలు ఉండకపోతుండటంతోనే జగన్ నియోజకవర్గానికి కోటి రూపాయల అభివృద్ధి నిధులు కేటాయించాల్సి వచ్చిందంటున్నారు. ఈ పనుల కోసమైనా వారు ప్రజలకు అందుబాటులో ఉంటారని ఆయన భావించినట్లుంది