జూరాల ప్రాజెక్ట్‌ 33 గేట్లు ఎత్తివేత - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

జూరాల ప్రాజెక్ట్‌ 33 గేట్లు ఎత్తివేత

జోగులాంబ గద్వాల అక్టోబర్ 23 (way2newstv.com)
ఎగువ నుంచి వరద ప్రవాహాలు భారీగా పెరగడంతో అధికారులు జూరాల ప్రాజెక్ట్‌ 33 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు ఆల్మట్టి డ్యాంకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో ఆల్మట్టి డ్యాం గేట్ల ద్వారా 2,50,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. 
జూరాల ప్రాజెక్ట్‌ 33 గేట్లు ఎత్తివేత

మరోవైపు నారాయణపూర్‌ డ్యాం 23 గేట్ల నుంచి 3,17,256 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయడంతో జూరాలకు వరద పోటెత్తింది. కుడి, ఎడమ కాల్వలకు అదేవిధంగా నెట్టెంపాడుకు అధికారులు నీటిని విడుదల చేశారు. ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద ఉదృతిని దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టు మరిన్ని గేట్లు తెరిచే అవకాశం ఉంది.