నవంబర్ 7 నుంచి ఎస్జీటీలో కొత్త టీచర్లు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

నవంబర్ 7 నుంచి ఎస్జీటీలో కొత్త టీచర్లు

వరంగల్, అక్టోబర్ 31, (way2newstv.com)
నవంబర్ లో కొత్త టీచర్స్ రాబోతున్నారు…కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్న ఎస్జీటీ తెలుగు టీచర్ల ఖాళీలు  భర్తీ చేసే పనిలో పడ్డారు అధికారులు. ఇప్పటికే జిల్లాల వారిగా డీఈవో వెబ్ సైట్లలో సెలక్టయిన అభ్యర్థుల లిస్టు అందుబాటులో ఉంచారు. నెలాఖరులోగా కౌన్సిలింగ్ ప్రక్రియ పూర్తిచేయనున్నట్లు తెలిపారు అధికారులు. ఎస్జీటీ తెలుగు మీడియం సెలెక్టెడ్ అభ్యర్ధులకు పోస్టింగ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ ను  విడుదల చేసింది టీఎస్పీసీ. దీంతో 3వేల325మంది టీచర్లకు లైన్ క్లియర్ అయ్యింది. సర్వీస్ కమీషన్ సెలెక్ట్ చేసి పంపిన లిస్ట్ లో ఉన్నవారి కౌన్సిలింగ్ ప్రక్రియను.. పాఠశాల విద్యాశాఖకు అప్పగించింది.
నవంబర్ 7 నుంచి ఎస్జీటీలో కొత్త టీచర్లు

అయితే ఇప్పటికే ఈ నెల 23న జిల్లా డీఈఓ కార్యాలయాలు, వెబ్ సైట్ల్ లో సెలెక్టెడ్ అభ్యర్ధుల జాబితాను అందుబాటులో ఉంచి, ప్రాసెస్ ని మొదలు పెట్టారు అధికారులు. రెండు రోజులుగా అభ్యర్ధులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తున్నమని చెప్తున్నారు విద్యాశాఖ అధికారులు.సెలెక్టెడ్ అభ్యర్ధుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయిన వెంటనే..  కౌన్సిలింగ్ తో పాటు అభ్యర్ధుల పోస్టింగ్ ఆర్డర్స్ కూడా ఇవ్వనుంది విద్యాశాఖ.  పాఠశాలల్లో ఉద్యోగాలు పొందిన అభ్యర్ధులు ఆయా స్కూల్స్ లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత నాన్ రిపోర్ట్ క్యాండిడేట్స్ విషయంలో మరో అవకాశాన్ని ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రాసెస్ నవంబర్ 7 వ తేది వరకు కంప్లిట్ చేసి టీఎస్పీఎస్సీ కి రిపోర్ట్ చేయనున్నారు విద్యాశాఖ అధికారులుకొత్త టీచర్ల నియమాకం హర్షించదగ్గ విషయమన్నారు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ విజయ్ కుమార్. అయితే..ప్రస్తుతం ఆయా పాఠశాలల్లో విద్యావాలంటరీలుగా పనిచేస్తున్న నిరుద్యోగులకు ఇది శాపమన్నారు. విద్యార్ధులు ఎక్కువగా ఉండి టీచర్లు, తక్కువగా ఉన్నచోట ఎస్టీటీ తెలుగు టీచర్లను నియమించేందుకు మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు.