హైద్రాబాద్, అక్టోబరు 2, (way2newstv.com)
తెలంగాణ కేబినెట్ పలు కమిటీలను ఏర్పాటు చేసింది. ఆర్టీసీ కార్మికుల సమస్యపై స్పందించిన కేబినెట్.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్టీసీని కాపాడుకోవాలని మంత్రి మండలి అభిప్రాయపడింది. ఆర్టీసీ అంశంపైనే మంత్రి వర్గం దాదాపు 2 గంటలపాటు చర్చలు జరిపింది. మంత్రివర్గ భేటీ సుదీర్ఘంగా ఏడు గంటలపాటు కొనసాగింది. ప్రజలు పండుగ కోసం సొంతూళ్లకు వెళ్తున్న సమయంలో సమ్మె చేయడం సరికాదని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు, ఇతర అంశాలపై అధ్యయనం కోసం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ అధ్యక్షతన త్రిసభ్య కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
8 వివిధ కమిటీలను ప్రచారం ప్రకటన
ప్రభుత్వ కార్యక్రమాల పర్యవేక్షణ, మరింత పకడ్బందీగా అమలు చేయడం కోసం.. ప్రభుత్వానికి సూచనలు చేయడం కోసం శాశ్వత ప్రాతిపదికన 8 మంత్రివర్గ ఉపసంఘాలను నియమించాలని మంత్రివర్గ భేటీలో నిర్ణయించారు.వైద్య, ఆరోగ్య కమిటీకి మంత్రి ఈటల రాజేందర్ నాయకత్వం వహిస్తారు. మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లలి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ సభ్యులుగా ఉంటారు. రాష్ట్రంలో ప్రజలకు అందుతున్న వైద్య సేవలు, వివిధ సీజన్లలో వచ్చే అంటువ్యాధులు, ఇతర వ్యాధుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రభుత్వం చేయాల్సిన పనులను ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది.పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నాయకత్వంలో గ్రామీణ పారిశుద్ధ్య కమిటీ, మున్సిపల్ మంత్రి కేటీఆర్ సారథ్యంలో పట్టణ పారిశుద్ధ్య కమిటీ పని చేస్తాయి.వనరుల సమీకరణ కమిటీకి ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు నాయకత్వం వహిస్తారు. మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్ సభ్యులుగా ఉంటారు. రాష్ట్ర స్థాయిలో వనరులను సమీకరణ, కేంద్రం నుంచి నిధులు రాబట్టడం తదితర అంశాలను ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది.
కమిటీ సారథి సభ్యులు
వైద్య, ఆరోగ్య కమిటీ ఈటల రాజేందర్ కేటీఆర్, ఎర్రబెల్లి, తలసాని
గ్రామీణ పారిశుద్ధ్య కమిటీ ఎర్రబెల్లి దయాకర్‌రావు ఇంద్ర కరణ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, పువ్వాడ అజయ్
పట్టణ పారిశుద్ధ్య కమిటీ కేటీఆర్ హరీశ్‌రావు, శ్రీనివాసగౌడ్, తలసాని, సబితా ఇంద్రారెడ్డి
వనరుల సమీకరణ కమిటీ హరీశ్ రావు కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్
పచ్చదనం కమిటీ ఇంద్ర కరణ్ రెడ్డి కేటీఆర్, జగదీశ్‌రెడ్డి, తలసాని, ప్రశాంత్‌రెడ్డి
వ్యవసాయ కమిటీ నిరంజన్ రెడ్డి గంగుల కమలాకర్, జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు
పౌల్ట్రీ కమిటీ తలసాని శ్రీనివాస్ శ్రీనివాసగౌడ్, ఈటల రాజేందర్, నిరంజన్‌రెడ్డి
సంక్షేమ కమిటీ కొప్పుల ఈశ్వర్ మహమూద్ అలీ, సత్యవతి రాఠోడ్, గంగుల కమలాకర్
Tags:
telangananews