హైదరాబాద్ అక్టోబరు 21, (way2newstv.com)
ఖమ్మం పట్టణ రెండో అదనపు ప్రథమ శ్రేణి కోర్టు న్యాయమూర్తి ఎం.జయమ్మ(45) విషజ్వరంతో మృతిచెందారు. గత పది రోజులుగా విషజ్వరంతో బాధపడుతున్న జయమ్మను సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం అర్ధరాత్రి ఆమె చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
డెంగ్యూతో మహిళా న్యాయమూర్తి మృతి
హైకోర్టు విభజనలో భాగంగా జయమ్మ సత్తెనపల్లి కోర్టు నుంచి ఖమ్మంకు బదిలీపై వచ్చారు. జయమ్మ మృతికి సహచర న్యాయమూర్తులు, న్యాయవాదులు విచారం వ్యక్తం చేసి మౌనం పాటించారు. జయమ్మ స్వగ్రామం మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలం అయోధ్యనగర్. జయమ్మకు భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు.