నెల్లూరు, అక్టోబర్ 21, (way2newstv.com)
ల్లూరు జిల్లాకు చెందిన కీలక రాజకీయ కుటుంబం పనబాక కృష్ణయ్య, పనబాక లక్ష్మి. కృష్ణయ్య ఐఆర్ ఎస్ ఉద్యోగి. పనబాబక లక్ష్మికి రాజకీయంగా అనుబంధం ఉంది. ఈ క్రమంలోనే ఆమె కాంగ్రెస్‌లో కీలక నాయకురా లిగా ఓ వెలుగు వెలిగారు. ముఖ్యంగా వైఎస్ కు అత్యంత చేరువ అయ్యారు. ఆయన అనుచరురాలిగా కూడా పేరు తెచ్చుకున్నారు. వైఎస్ జీవించి ఉన్న సమయంలో ఆయన ఆశీస్సులతోనే తాను టికెట్ తెచ్చుకున్నానని పలుమార్లు వెల్లడించిన నాయకురాలు కూడా పనబాకలక్ష్మి. ఎస్సీ వర్గానికి చెందిన పనబాక కుటుంబం.. రాజకీయాల్లో నెల్లూరు ఎస్సీ రిజర్వ్‌డ్‌గా ఉన్న సమయంలో నెల్లూరు జిల్లా నుంచి పోటీ చేసి విజయం సాధించారు.
ఫ్యాన్ రెక్కల కిందకు పనబాక...
1996, 1998లో పనబాక లక్ష్మి నెల్లూరు నుంచి కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేసి విజయం సాధించారు. తర్వాత జరిగిన ఎన్నికల్లో మాత్రం ఆమె ఓటమి పాలయ్యారు. ఇక, 2004 కు వచ్చే సరికి నెల్లూరు జనరల్ కావడంతో పనబాక లక్ష్మి తన మకాంను బాపట్లకు మార్చుకున్నారు. ఇక్కడ నుంచి 2004లో ఎంపీగా పోటీ చేసి విజయం సాధించా రు. ఈ సమయంలోనే వైఎస్ దగ్గర మంచి మార్కులు కూడా సంపాయించుకున్నారు. 2009లో నూ టికెట్ సాధించి విజయం దక్కించుకుని కేంద్రంలో మంత్రిగా పనబాక లక్ష్మి చక్రం తిప్పారు. ఈ ఎన్నికల్లో ఆమె నెల్లూరు జనరల్ కావడంతో బాపట్లలో పోటీ చేశారు. వైఎస్ మృతి తర్వాత ఆమె అధిష్టానానికి వీరవిధేయురాలిగా గుర్తింపు పొందారు. ఈ క్రమంలోనే అప్పటికి ఐఆర్ ఎస్ ఉద్యోగానికి రిజైన్ చేసిన కృష్ణయ్యను కూడా రాజకీయాల్లోకి తీసుకువచ్చారు. నెల్లూరు జిల్లా ఎస్సీ నియోజకవర్గం గూడూరు టికెట్‌ను ఇప్పించుకున్నారు. అయితే, ఆయన ఓటమి పాలయ్యారు. ఇక 2014 ఎన్నికల్లోనూ ఈ దంపతులు ఇద్దరు ఓడిపోయారు. అప్పటి నుంచి రాష్ట్ర విభజన తర్వాత కూడా చాలా కాలం పాటు ఈ భార్యా భర్తలు ఇద్దరూ కూడా కాంగ్రెస్‌లో నే ఉన్నారు. వైసీపీ నుంచి అనేక ఆఫర్లు వచ్చినా కూడా కాంగ్రెస్‌ను విడిచి పెట్టలేదు. కానీ, ఇటీవల ఎన్నికలకు ముందు మాత్రం కాంగ్రెస్‌లో ఉంటే పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని భావించిన ఈ దంపతులు .. టీడీపీలోకి జంప్ చేశారు. ఈ క్రమంలోనే పనబాక లక్ష్మి తిరుపతి ఎంపీ స్థానం నుంచి పోటీ చేశారు. అయితే, జగన్ సునామీ ముందు పనబాక లక్ష్మి ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం ఈ దంపతులు ఇద్దరూ కూడా రాజకీయంగా మౌనవ్రతం చేస్తున్నారు.ఆది నుంచి ఉన్న కాంగ్రెస్ పూర్తిగా చతికిల పడిపోవడం, ఇప్పట్లో ఈ పార్టీ బతికి బట్టకట్టే పరిస్థితి కూడా లేకపోవడం, నమ్ముకున్న టీడీపీ పరిస్థితి కూడా తాజా ఎన్నికల్లో దారుణంగా ఉండడంతో ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు. అయితే, వీరికి బీజేపీ నుంచి ఆఫర్లు వస్తున్నాయని కొద్ది రోజులుగా వార్తలు గుప్పుమంటున్నాయి. కొన్ని రోజుల్లోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఏపీలో పర్యటించే అవకాశం కనిపిస్తోంది. ఈ క్రమంలో ఆయన ఆధ్వర్యంలో పార్టీలో చేరతారా? లేక మౌనంగానే టీడీపీలో ఉంటారా? అనేది వేచి చూడాలి. ఏదేమైనా.. పనబాక లక్ష్మి టీడీపీలో యాక్టివ్ అవ్వాలనుకున్నా కూడా కావడంలేదట.