తెలంగాణలో పంచాయితీ కార్మికులకు గుడ్ న్యూస్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

తెలంగాణలో పంచాయితీ కార్మికులకు గుడ్ న్యూస్

హైద్రాబాద్, అక్టోబరు 15 (way2newstv.com)
గ్రామ పంచాయతీ కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. కార్మికుల వేతనాలను నెలకు రూ.8,500లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య, ఇతర కార్మికులకు ఒక్కో గ్రామంలో ఒక్కోలా వేతనాలు ఉన్నాయి. ఈ పరిస్థితిని గుర్తించిన ప్రభుత్వం అన్ని పంచాయతీల్లో ఒకే రకమైన వేతనాలు ఉండేలా నిర్ణయం తీసుకుంది.
తెలంగాణలో పంచాయితీ కార్మికులకు గుడ్ న్యూస్

పెంచిన జీతాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నిధులను విడుదల చేస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వం జీతాలు పెంచడంతో కార్మికుల కుటుంబాల్లో దీపావళి ముందే వచ్చింది. కేసీఆర్ నిర్ణయంపై కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు.. రాష్ట్రంలో ఆర్టీసీ ఉద్యోగులు చేపట్టిన సమ్మె తీవ్ర రూపం దాల్చగా.. ఆర్టీసీ కార్మికుల విషయాన్ని వదిలేసి, ఇతర శాఖల ఉద్యోగుల గురించి సీఎం కేసీఆర్ నిర్ణయాలు తీసుకుంటుండటం చర్చనీయాంశంగా మారింది. ఆర్టీసీ ఉద్యోగుల ఆత్మహత్యల నేపథ్యంలో చర్చలకు సిద్ధమని ఎంపీ కేశవరావు ద్వారా సంకేతాలు పంపిన సీఎం.. తమ విషయంలోనూ సానుకూల నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నారు.