ఇక సిటిలో పర్మినెంట్ రోడ్లు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఇక సిటిలో పర్మినెంట్ రోడ్లు

హైద్రాబాద్, అక్టోబరు 3, (way2newstv.com)
హైద్రాబాద్ సిటీలో చెక్కు చెదరకుండా 12 ఏళ్లు మన్నే రోడ్ల నిర్మాణంపై గ్రేటర్ అధికారులు దృష్టి పెట్టారు. ఏటా మాదిరిగా రోడ్లు పాడవకుండా పదికాలాలపాటు మన్నికగా ఉండాలనేసంకల్పంతో ప్రభుత్వం ఖర్చుకు వెనకాడకుండా పీపీఎం కార్యక్రమం కింద రూ. 721కోట్లు మంజూరుచేసింది. ఇందులో భాగంగా ఇదివరకు మొదటి లేయర్ బీటీ ఏర్పాటు పూర్తికాగా,తాజాగా వర్షాలు తగ్గిపోవడంతో పాలిమర్ మోడిఫైడ్ బిటమిన్ ఎమల్షన్, క్రంబ్ రబ్బర్ మోడిఫైడ్ బిటమిన్ తో రెండో లేయర్ ఏర్పాటు పనులు ప్రారంభించారు.మన్నిక కోసం పాలిమర్మోడిఫైడ్ బిటమిన్ ఎమల్షన్, క్రంబ్ రబ్బర్ మోడిఫైడ్ బిటమిన్ ను వినియోగిస్తున్నారు. ఎన్నడూ లేనివిధంగా ఈసారి రోడ్డు పునరుద్ధరణ పనులు అత్యంత నాణ్యమైన పద్ధతుల్లో చేపడుతున్నారు. 
ఇక సిటిలో పర్మినెంట్ రోడ్లు

దీనికోసం పాలిమర్ మోడిఫైడ్ బిటమిన్ ఎమల్షన్(పీఎంబీఈ), క్రంబ్ రబ్బర్ మోడిఫైడ్ బిటమిన్(సీఆర్‌ఎంబీ)ను వినియోగిస్తున్నారు. ఇతరత్రా ఇబ్బందులు లేకుండాపీఎంబీ రోడ్లు కనీసం 12ఏళ్లు మన్నుతాయని అధికారులు భరోసా ఇస్తున్నారు.ఆర్టీసీ క్రాస్‌రోడ్-ఇందిరాపార్క్, కాచిగూడ స్టేషన్ రోడ్ తదితర రోడ్లను ఇప్పటికీ పీఎంబీతోఏర్పాటుచేసినట్లు వారు తెలిపారు. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షాలకు ముందు మొదటి లేయర్ పనులు పూర్తిచేయగా, ఇప్పుడు ఆ అన్ని రోడ్లకూ రెండో లేయర్ పనులు చేపట్టినట్లుచెప్పారు. రూ.381.36 కోట్లతో 51 బీటీ రోడ్ల పునరుద్ధరణ పనులు చేపట్టగా, అందులో ఇప్పటివరకు 1.10కోట్లతో ఒక పని పూర్తయింది. 337.68కోట్ల విలువైన 44పనులు పురోగతిలోఉండగా, రూ. 33. 38కోట్లతో ఐదు పనుల టెండర్లు ఖరారై పనులు చేపట్టాల్సి ఉంది. మిగిలిన రూ. 9.20కోట్ల విలువైన రెండు పనులకు ఇంకా టెండర్లు పిలవాల్సి ఉంది. ఇక సీసీ రోడ్లవిషయానికొస్తే, మొత్తం రూ. 302. 96కోట్లతో 56 పనులు చేపట్టారు. ఇందులో రూ. 191.83కోట్ల విలువైన 35పనులు పురోగతిలో ఉన్నాయి. రూ. 89.75కోట్లతో 16 పనులకు టెండర్లుపూర్తయి పనులు చేపట్టాల్సి ఉండగా, రూ. 13.83కోట్ల విలువైన మూడు పనులు టెండర్లు ఖరారుకావాల్సి ఉంది.