ముంబై అక్టోబర్ 18 (way2newstv.com)
కాలేయ సంబంధ సమస్యలతో బాద పడుతున్న బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చేరారు. మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో అమితాబ్‌ను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. గత మూడు రోజులగా ఆయన ఈ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు సమాచారం.
కాలేయ సంబంధ సమస్యలతో ఆస్పత్రిలో చేరిన అమితాబ్ బచ్చన్
ఐసీయూ తరహాలోని రూమ్‌లో ఆయనను ఉంచారని, కుటుంబ సభ్యులు తరచూ ఆస్పత్రికి వస్తున్నారని తెలిసింది. కాగా, అమితాబ్ రెగ్యులర్‌గా చేయించుకునే ఆరోగ్య పరీక్షల నిమిత్తం అడ్మిట్ అయ్యారని, ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాలని ఆయనకు వైద్యులు సూచించారని పేర్కొన్నాయి. అమితాబ్ ఆరోగ్యంపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు స్పష్టం చేశారు.