ఆర్టీసీ కార్మికులతో త్రిసభ్య కమిటీ చర్చలు విఫలం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఆర్టీసీ కార్మికులతో త్రిసభ్య కమిటీ చర్చలు విఫలం

హైదరాబాద్ అక్టోబర్ 02,(way2newstv.com):
తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాలతో త్రిసభ్య కమిటీ చర్చలు విఫలమయ్యాయి. ఈ నేపధ్యంలో ఈనెల 5 నుంచి ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉంటుందని కార్మిక సంఘాలు ప్రకటించాయి. ప్రభుత్వం నుంచి సరైన హామీ రాలేదని తెలిపాయి. కార్మికులందరూ సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చాయి. ప్రభుత్వం ప్లాన్ బీ రెడీ చేసినా సమ్మె మాత్రం ఆగదని హెచ్చరించాయి.కార్మిక సంఘాలు ఇచ్చిన 26 డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తెగిసుకెళ్తాం. ఆర్టీసీ సమస్యల పై పూర్తి నివేదిక ఇవ్వడానికి సమయం పడుతుంది.  
ఆర్టీసీ కార్మికులతో త్రిసభ్య కమిటీ చర్చలు విఫలం

సంఘాలు సమ్మె పై పునరాలోచించాలి. సమ్మె వల్ల ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటారని త్రిసభ్య కమిటీ పేర్కోంది. కార్మికులు సమ్మె విరమించుకోకపోతే ప్లాన్-బీ అమలుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రభుత్వం కమిటీ ఆర్టీసీ పూర్తిస్థాయి సమస్య పరిష్కారం కోసం వేసింది. 5వ తేదీలోపు మళ్ళీ కార్మికుల సంఘాలతో సమావేశాలు ఉంటాయని పేర్కోంది. త్రిసభ్య కమిటీలో అధికారులు సోమేశ్ కుమార్, సునిల్ శర్మ , రామకృష్ణ రావు వున్నారు.  టీఎస్ ఆర్టీసీ జేఏసి నేతలు మాట్లాడుతూ ఆర్టీసీ సమస్యలు ప్రభుత్వం వేసిన కమిటీ దృష్టికి తీసుకెళ్లాం.  26 డిమాండ్ల తో కమిటీకి సమస్యల నివేదికను అందించాం.  ప్రభుత్వం వేసిన కమిటీల పై మాకు నమ్మకం లేదు.  సమస్యల పరిష్కారం కోసం ఎంత సమయం కావాలో కమిటీ క్లారిటీ ఇవ్వడం లేదని అన్నారు.  5వ తేదీ సమ్మెకు వెళ్తున్నాము..కార్మికులు సిద్ధంగా ఉండాలి.  ప్రభుత్వం ప్లాన్-బి,సి లు వేసినా ..మా ప్లాన్స్ మాకు ఉన్నాయని అన్నారు.  ఎస్మా లాంటి చట్టాలను ప్రయోగిస్తామనే బెదిరింపులకు భయపడేది లేదు.  ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం డిమాండ్ ఏపీ కంటే ముందే తెలంగాణ లో ఉందని వారన్నారు.