హైదరాబాద్ అక్టోబర్ 25 (way2newstv.com)
ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ సీఎం కేసీఆర్ వైఖరిని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి తప్పుబట్టారు. ఆర్టీసీ కార్మికుల కడుపుకొట్టి కేసీఆర్ చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. కేంద్రం చట్టం చేసింది.. అందుకే 50వేల మంది కార్మికులను తొలగిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇస్తుందని తెలిపారు.
ఇల్లు అలకగానే పండగ కాదు: కిషన్‌రెడ్డి
కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఆర్టీసీ కార్మికుల పొట్ట కొట్టమని చెప్పలేదని స్పష్టం చేశారు. హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన.. ఇల్లు అలకగానే పండగ కాదని వ్యాఖ్యానించారు.